NTV Telugu Site icon

West Indies vs Bangladesh: సొంతగడ్డలో వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్

West Indies Vs Bangladesh

West Indies Vs Bangladesh

West Indies vs Bangladesh: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ20లో ఆతిథ్య జట్టును 80 పరుగుల తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ముందుగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తర్వాతి రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలిచింది. మూడో టీ20లో బంగ్లాదేశ్ వెస్టిండీస్‌కు 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, వెస్టిండీస్ 109 పరుగులకు మించి స్కోరు చేయలేకపోయింది. 17వ ఓవర్‌లోనే వారి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో, విదేశాల్లో ఆడిన టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ తొలిసారి క్లీన్ స్వీప్ చేసింది.

Also Read: Alzheimer: ఆ పనులు చేసేవారికి అల్జీమర్స్ బారినపడే అవకాశం తక్కువట!

మూడో టీ20లో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో జకీర్ అలీ 41 బంతుల్లో 6 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. దీనితో బంగ్లాదేశ్ కు భారీ విజయం దక్కింది. 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, వెస్టిండీస్ జట్టు మొదటి నుంచి దారుణమైన పరిస్థితిలో చిక్కుకుంది. బంగ్లాదేశ్ జట్టు సగం వికెట్లను కేవలం 46 పరుగులకే కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఏ దశలో పుంజుకోలేకపోయిన వెస్టిండీస్ జట్టు మొత్తం 16.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. దింతో సొంతగడ్డలో వెస్టిండీస్‌కు ఘోర అవమానం జరిగినట్లైంది. ఇక ఈ పర్యటనలో మొదట రెండు టెస్టులలో చిరు జట్టు విజయం సాధించగా.. వన్డేలలో 3 – 0తో వెస్టిండీస్ బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ వెస్టిండీస్ పై ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఉంది.