భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు కుప్పకూలిపోకుండా నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం టీ విరామ సమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (235 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 75 పరుగులు) అర్ధ సెంచరీ చేయగా.. బ్లాక్‌వుడ్ (16 నాటౌట్), అలిక్ అతనజ్ (13 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా మూడో రోజు ఆటకు ఆటంకం కలిగింది.
Read Also: IndvsBan: టీమిండియా మహిళల జట్టుకు చేజారిన విజయం.. సిరీస్ సమం
తొలి సెషన్‌లో 10.4 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. కాగా, విండీస్ 31 పరుగులు చేసిన తర్వాత కిర్క్ మెకన్జీ (57 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులు) భారత్ తరఫున అరంగేట్రం చేసిన ముకేశ్ కుమార్ వేసిన బంతిని ఆడలేక ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెకన్జీ మంచి షాట్స్ తో బ్యాటింగ్ చేశాడు. జయదేవ్ ఉనాద్కట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను అశ్విన్ బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా సిక్స్ కొట్టాడు. లంచ్ విరామ సమయానికి బ్రాత్‌వైట్ 49 పరుగులు చేశాడు. రెండో సెషన్ ప్రారంభం కాగానే బ్రాత్‌వైట్ 170 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. అయితే ఇదే సెషన్‌లో అతని వికెట్ తీయడంలో టీమిండియా సక్సెస్ అయింది.
Read Also: Honey Trap: తల్లికి బాలేదని డాక్టర్‌ను ఇంటికి పిలిచింది.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఓ చక్కటి బంతికి బ్రాత్‌వైట్ మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. ఆ తర్వాత బ్లాక్‌వుడ్, అతనజ్ కలిసి జట్టును ముందుకు నడిపించారు. మరో 13.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన టీమిండియా ఈ జోడీని విడదీయడంలో విఫలమైంది. రెండు రివ్యూలు కూడా భారత్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. తొలి టెస్టుతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. రెండో రోజు వెస్టిండీస్ ఓపెనర్లు పట్టుదలగా ఆడి జట్టుకు మంచి శుభారంభం అందించారు. బ్రాత్‌వైట్, తేజ్ నారాయణ్ చందర్‌పాల్ కలిసి 34.2 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచి 71 పరుగులు చేశారు. అయితే, రవింద్ర జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.