Honey Trap: తల్లికి బాలేదని డాక్టర్‌ను ఇంటికి పిలిచింది.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honey Trap: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి హనీట్రాప్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈసారి హనీట్రాప్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పుడు మొత్తం రాకెట్‌ను ఛేదించారు. ఈ కేసులో హిమానీగా గుర్తించిన 22 ఏళ్ల యువతిని అరెస్టు చేశారు. హనీట్రాప్‌లో చిక్కుకున్న డాక్టర్ షాక్ తట్టుకోలేక చనిపోయాడు. ఈ కేసు తెరపైకి రావడంతో పోలీసులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ కేసు బరేలీలోని సుభాష్‌నగర్‌కు చెందినది. అక్కడ డాక్టర్ తన క్లినిక్‌ని కాలనీలో నడుపుతున్నాడు. ఈ క్రమంలో హిమానీ తనకు ఫోన్ చేసి ఉద్యోగం కావాలని చెప్పింది. తర్వాత స్నేహితుడితో కలిసి, ఆమె మరుసటి రోజు క్లినిక్‌కి చేరుకుంది. ఈ కేసు 2022లో ప్రారంభమైంది. దాదాపు 10 రోజుల తర్వాత అకస్మాత్తుగా డాక్టర్‌కి హిమానీ నుంచి కాల్ వచ్చింది. తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆమె చాలా బాధగా ఉందన్నారు. ఆ తర్వాత డాక్టర్‌ని ఇంటికి రమ్మని అడిగింది.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Read Also:Nellore: ప్రభుత్వాసుపత్రిలో ఆక్సీజన్ అందక 8 మంది రోగులు మృతి…కుటుంబ సభ్యుల ఆందోళన
అప్పుడు హిమానీ తన పేరు ప్రియ అని చెప్పింది. హిమానీ తన అడ్రస్‌కి డాక్టర్‌ని పిలిచింది. దీంతో డాక్టర్‌ని ఇంట్లోకి తీసుకెళ్లి.. తల్లి మంచంపై పడుకుందని చెప్పింది. గదిలోకి వెళ్లిన తర్వాత హిమాని డాక్టర్ ను బలవంతం చేసింది. ఆ తర్వాత హిమానీ స్నేహితులు (1 అమ్మాయి, 2 అబ్బాయిలు) గదిలోకి ప్రవేశించి డాక్టర్ అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశారు. తర్వాత అందరూ కలిసి డాక్టర్‌ని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. చాలా రోజుల తర్వాత వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా, అప్పటికే అతడి నుంచి లక్ష రూపాయలు దోచుకున్నారు.
ఇప్పటి వరకు 8 మంది ఆర్మీ జవాన్లను కూడా హిమాని ట్రాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హిమాని విచారణలో ఆమె బదౌన్‌లోని బిసౌలీ నివాసి అని తేలింది. ఎవరైనా హనీట్రాప్ చేస్తే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
Read Also:ChatGPT :త్వరలో అందుబాటులోకి ChatGPT ఆండ్రాయిడ్ యాప్..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?