Site icon NTV Telugu

Bhutan PM: మా అన్నయ్య నరేంద్ర మోడీకి భూటాన్ స్వాగతం..

Bhutan

Bhutan

ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భూటాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ప్రధాని మోడీ పర్యటన భూటాన్- భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ సందర్భంగా “నా అన్నయ్య నరేంద్ర మోడీజీ భూటాన్‌కు స్వాగతం” అని భూటాన్ ప్రధానమంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. దీంతో పాటు భూటాన్ రాజు ప్రధాని మోడీతో కరచాలనం చేస్తున్న పెద్ద హౌర్డింగ్ చిత్రాన్ని పంచుకున్నారు.

Read Also: Penamaluru: పెనమలూరు సీటుపై వీడిన ఉత్కంఠ.. సంబరాల్లో బోడె ప్రసాద్..

అయితే, ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ రాకకు ముందు పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతూ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీ భూటాన్‌ ప్రధానితో ఉన్న పోస్టర్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ మొత్తం పూలమాలలు, రంగోలీలతో అలంకరించారు. ప్రధాని మోడీకి స్వాగతం పలుతూ భూటాన్ సంస్కృతిని తెలిపే రంగురంగుల జెండాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక, ప్రధాని మోడీ కాన్వాయ్ పారో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజధాని థింపూకు వెళ్తుండగా.. పెద్ద సంఖ్యలో భూటాన్ ప్రజలు రోడ్డుకు ఇరువైపులా భారత జెండాలు పట్టుకుని నిలబడి ఉన్నారు. ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు. అలాగే, థింపూలో ప్రధాని మోడీ రాకను స్వాగతిస్తూ జిగ్మే లోసెల్ ప్రైమరీ స్కూల్‌లోని పాఠశాల పిల్లలు రోడ్డుపై నిలబడి స్వాగతం పలికారు.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపటం కష్టం.. కానీ, ఒక మార్గం ఉంది..!

ఈ పర్యటనలో ప్రధాని మోడీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లను కలవనున్నారు. భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్‌గేతో కూడా ప్రధానితో చర్చలు జరపనున్నారు. భారతదేశం- భూటాన్‌ల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ పర్యటనలో ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’ని నొక్కి చెప్పడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.


URL

Exit mobile version