NTV Telugu Site icon

Weight Loss Soups: ఈ వెజిటేబుల్ సూప్ తాగితే.. వారం రోజుల్లో బరువు తగ్గుతారు!

Weight Loss Soups

Weight Loss Soups

Here is List of Vegetable Soups For Weight Loss in One Week: ‘వెజిటబుల్ సూప్’ శరీరానికి చాలా మేలు చేస్తుంది. వెజ్ సూప్స్ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. అంతేకాదు శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఆహారం తినే ముందు వెజిటబుల్ సూప్‌లు తాగితే.. ఆహారం జీర్ణం కావడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. అన్ని కూరగాయలు శారీరానికి మంచివే అయినా.. బరువు తగ్గడానికి కొన్ని కూరగాయలు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. అవేంటో (Veg Soups For Weight Loss) ఇప్పుడు తెలుసుకుందాం.

Cauliflower Soup:
బరువు తగ్గడానికి కాలీఫ్లవర్ సూప్ బాగా పనిచేస్తుంది. దీన్ని చేయడానికి ఒక పాన్లో కొద్దిగా నూనె తీసుకోండి. ఆ నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత అందులో ఉప్పు, ఎండుమిర్చి వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. సూప్ చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ సూప్‌లో కొత్తిమీర తరుగు వేసి సతాగేయాలి.

Also Read: REDMI Note 12 Pro 5G Price: భారీగా తగ్గిన రెడ్‌మీ నోట్ 12 ప్రో ధర.. ఆఫర్ కొద్ది రోజులే!

Beetroot Soup:
బీట్‌రూట్ సూప్ బరువు తగ్గడానికి దొగడపడుతుంది. ఈ సూప్ చేయడానికి కుక్కర్‌లో కొంచెం నూనె వేసి.. అందులో ఉల్లిపాయ, టొమాటో మరియు బీట్‌రూట్ వేసి వేయించాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి విజిల్ వచ్చేవరకు హీట్ చేయాలి. కాస్త చల్లబడిన తర్వాత ఉప్పు, ఎండుమిర్చి వేసి కలపాలి. ఆపై తాగేయాలి.

Gourd Soup:
బరువు తగ్గడానికి సొరకాయ సూప్ చాలా మేలు చేస్తుంది. దీన్ని చేయడానికి ముందుగా బాణలిలో నూనె వేసి.. ఉల్లిపాయలు, టొమాటో వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన సొరకాయ, నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, ఎండుమిర్చి వేయాలి. ఈ సూప్ చల్లారిన తర్వాత నిమ్మరసం కలిపి తాగేయాలి. ఇలా రోజూ తాగితే.. వారం రోజుల్లో మీకు రిసల్ట్ కనిపిస్తుంది. ఈ మూడింటిలో ఏది ట్రై చేసినా మంచి ప్రయోజనం ఉంటుంది.

Also Read: Virat Kohli Century: క్రికెట్ చరిత్రలో ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ.. సచిన్‌ టెండూల్కర్‌కు కూడా సాధ్యం కాలేదు!

Show comments