NTV Telugu Site icon

Weight Loss Diet: వీటిని రోజూ తీసుకుంటే ఒంట్లో కొవ్వు మంచులా కరిగిపోతుంది..

Weight Loss Eeds

Weight Loss Eeds

బరువు పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం..ఆరోగ్యంగా బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, లైఫ్‌స్టైల్‌లో మంచి అలవాట్లు, పోషకాహారం కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని రకమైన విత్తనాలు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.. వాటిని రోజు డైట్ భాగం చేసుకుంటే సులువుగా బరువు తగ్గుతారట.. ఈ విత్తనాలలో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటిలో మీ హార్మోన్లు, బరువును కంట్రోల్‌లో ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. మీరు బరువు తగ్గడానికి సహాయపడే విత్తనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వులలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మెండుగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్‌ ఆహారం. నువ్వులు మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి, జీర్ణక్రియకు మేలు చేస్తాయి. రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయట. ఫలితంగా గుండెసమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. వీటిలో మంచి కొవ్వులు ఉండటం వల్లే ఎక్కువగా వీటిని తినడం మంచిదని నిపుణులు అంటున్నారు..

గుమ్మడి గింజల్లో ప్రొటీన్‌, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడిగింజలు మిమ్మల్ని నిండుగా, సంతృప్తిగా ఉంచుతాయి. గుమ్మడి గింజలు మీ డైట్‌లో చేర్చుకుంటే.. ఫుడ్‌ క్రేవింగ్స్‌ తగ్గుతాయి. దీంతో ఎక్కువగా ఆహారం తినకుండా ఉంటారు. గుమ్మడి గింజల్లో జింక్‌ అధికంగా ఉంటుంది. ఇది శరీరం జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీరు బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్‌లో చేర్చుకోవాలి..

పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల స్టోర్‌ హౌస్‌. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచుతుంది.. అందుకే ఆరోగ్యానికి చాలా మంచిది..

అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి సహాయపడతాయి. అవిసెగింజల్లో ఒమెగా-3, పీచు పుష్కలంగా ఉండటం వల్ల గుండెకు మేలు జరుగుతుంది.. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి..
అలాగే చియా విత్తనాలు కూడా మంచివే.. బరువును సులువుగా బరువును తగ్గుతారు.. ఏది తీసుకున్న లిమిట్ గా తీసుకోవడం మంచిది..