NTV Telugu Site icon

Wedding Gown : ఈ పెళ్లి గౌన్ గిన్నీస్ రికార్డ్ సాధించిందా.. ఏముంది అందులో స్పెషాలిటీ ?

New Project (15)

New Project (15)

Wedding Gown : ప్రతి ఒక్కరికి జీవితంలో పెళ్లి అనేది స్పెషల్. ఆ రోజు అందరి కంటే డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. కారణం పెళ్లికి వచ్చిన వాళ్లంతా వారి ధరించిన దుస్తుల పైనే చూపుంటుంది. అందుకే వెడ్డింగ్ డ్రెస్ ను స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు. ఓ అమ్మాయి వెడ్డింగ్ గౌన్ అయితే ఏకంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది. ఏంటి ఆ గౌను ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారు. దుస్తులు, నగలు ఇష్టపడని మహిళలు ఎవరు ఉండరు. అలంకరణ అమ్మాయిలకు మరింత అందాన్ని తీసుకువస్తుంది. అంత ఇష్టంగా ధరించే దుస్తులను ఆభరణాలతో డిజైన్ చేస్తే ఇంక ఎంత అద్భుతంగా ఉంటుంది. ఓ యువతి క్రిస్టల్స్‌తో తన పెళ్లి గౌను డిజైన్ చేయించుకుంది. ఆ గౌన్ ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ వెడ్డింగ్ గౌనులో 50,890 క్రిస్టల్స్‌ని ఉపయోగించి డ్రెస్‌ను తయారు చేశారు. చేతి స్లీవ్స్ కూడా స్ఫటికాలతో అలంకరించారు.

Read Also:Physical Harassment: కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఈ గౌనును ఇటాలియన్ బ్రైడల్ ఫ్యాషన్ బ్రాండ్ డిజైన్ చేశారు. మైఖేలా ఫెర్రెరో ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఈ డ్రెస్ తయారు చేయడానికి దాదాపు 4నెలల టైం పట్టింది. పెళ్లి రోజున మోడల్ మార్చే గెలానీ కావ్-అల్కాంటే ఈ దుస్తులను ధరించింది. ప్రస్తుతం ఈ ఆకర్షణీయమైన గౌను గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ వస్త్రం ప్రత్యేకతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విటర్ పేజీలో పంచుకున్నారు. గతంలో రికార్డు ఓజ్డెన్ గెలిన్లిక్ మోడా తసరిమ్ లిమిటెడ్ (టర్కీ) పేరుతో ఉంది. 45,024 క్రిస్టల్‌తో టర్కీలోని ఇస్తాంబుల్‌లోని ఫోరమ్ ఇస్తాంబుల్ షాపింగ్ మాల్‌లో 29 జనవరి 2011న ప్రదర్శించారు.

Read Also:Wrestlers Protest : మేమే నేరస్తులమయ్యాం.. మా ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు

Show comments