NTV Telugu Site icon

Wedding: జొమాటో నిర్లక్ష్యం.. మటన్ బిర్యానీ లేదని పెళ్లి వాయిదా..!!

Wedding

Wedding

తమిళనాడులోని ఓరథనాడు ప్రాంతంలో ఓ ఇంట్లో పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ శుభకార్యం కోసం బంధువులు, స్నేహితులంతా తరలివచ్చారు. దీంతో సదరు కుటుంబం అతిథులకు మటన్ బిర్యానీతో డిన్నర్ ఏర్పాటు చేశారు. పెళ్లితంతు అంతా స‌వ్యంగానే జరిగింది. అయితే ఒక్కసారిగా పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మటన్ బిర్యానీ లేకపోవడమే ఇందుకు కారణ‌మ‌ని చెప్పడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. అయితే ఇదంతా జొమాటో నిర్లక్ష్యంతోనే జ‌రిగింద‌ని కుటుంబ స‌భ్యులు వాపోయారు.

Punjab: మంత్రి గారి కక్కుర్తి.. రెండు నెలలకే పదవి నుంచి అవుట్..!!

పెళ్లి శుభకార్యం కోసం కుటుంబ సభ్యులు మటన్ బిర్యానీ అందించాలని సేలం ఆర్ ఆర్ బిర్యానీ సెంటర్‌కు ఆర్డర్ ఇచ్చారు. వాళ్లు మటన్ కోసం ఆన్‌లైన్ ఫుడ్ సరఫరా కంపెనీ జొమాటోను ఆశ్రయించారు. దీంతో జొమాటో నిర్వాహకులు 3,500 కిలోల మటన్‌ను బెంగళూరు నుంచి తమిళనాడుకు పార్శిల్ చేశారు. అయితే ఆర్డర్‌లో కుళ్లిపోయిన మాంసం ఉందని అధికారులకు ఫిర్యాదు అందడంతో తనిఖీలు నిర్వహించారు. మాంసం కుళ్లిపోయిందని అధికారులు నిర్ధారించారు. దీంతో సేలంఆ ఆర్ ఆర్ బిర్యానీ సెంటర్‌తో పాటు జొమాటోకు నోటీసులు జారీ చేశారు. అప్పటికప్పుడు బిర్యానీ చేసేందుకు మటన్ లేకపోవడంతో అతిథులు ముందు పరువు పోకూడదనే ఉద్దేశంతో కుటుంబీకులు వివాహం వాయిదా వేసుకున్నారు.