గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా హడలెత్తించిన ఎండలు ఇప్పుడు కొద్దిగా శాంతించాయి. వేడి గాలులు తగ్గుముఖం పట్టాయి. రెండు, మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు.. చల్లని గాలులతో ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ మరో చల్లని కబురు చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Sanju Samson Fine: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్!
ఏప్రిల్ 11 నుంచి 13 వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే మరాఠ్వాడాలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆప్ఘనిస్థాన్ దానిని ఆనుకుని ఉత్తర పాకిస్థాన్ దగ్గర తుఫాన్ ఏర్పడిందని తెలిపింది. దీంతో ఏప్రిల్ 12న వాయువ్య భారతదేశంపై ప్రభావం చూపే చాన్సుందని పేర్కొంది. జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఏప్రిల్ 11 నుంచి 12 వరకు తేలికపాటి వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: KTR: సింగరేణి కార్మికుడి నుంచి మంత్రిగా.. కొప్పుల ప్రస్థానంపై కేటీఆర్ వ్యాఖ్యలు
ఇక ఏప్రిల్ 13-14 తేదీలలో రాజస్థాన్‌లో దుమ్ము తుఫానులు, ఉరుములతో పాటు వివిధ ప్రాంతాలలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కేరళ, మాహేలో, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, యానాం, కోస్టల్ కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో వేడి మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు వాతావరణ శాఖ సూచించింది.
ఇది కూడా చదవండి: Love Guru Review: విజయ్ ఆంటోనీ ‘లవ్ గురు’ రివ్యూ!