NTV Telugu Site icon

Komatireddy Rajgopal Reddy : భువనగిరిలో బీఆర్‌ఎస్‌ లేదు.. బీజేపీతోనే మాకు పోటీ

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

భువనగిరి పార్లమెంట్‌ స్థానంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రంజాన్‌ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. భువనగిరిలో బీఆర్‌ఎస్‌ లేదు. బీజేపీతోనే మాకు పోటీ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ రానున్నట్లు, మిర్యాలగూడ, చౌటుప్పల్ లో సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్లకుండా పని చేస్తామని, సీఎం ఆదేశాల ప్రకారం పని చేసి పార్టీని గెలిపిస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రివ్యూ మీటింగ్‌లో నాకు ఇంఛార్జి భాద్యతలు పార్టీ అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని చర్చించామని, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారన్నారు.

అంతేకాకుండా..’చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ ప్రచారం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేశాం. భువనగిరిలో బీ ఆర్ ఎస్ చాప్టర్ క్లోజ్ అయ్యింది. 24 గంటల కార్యకర్తలు పని చేయాలి. పోలింగ్ వరకు కార్యకర్తలు విరామం లేకుండా పని చేయాలి. ప్రతి నియోజక వర్గంలో ఈ నెల 18 వరకు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తాం. మే మొదటి వారంలో చౌటుప్పల్,మిర్యాలగూడ బహిరంగ సభలకు ప్రియాంక గాంధీ హాజరవుతారు. ఈ నెల 21న భువనగిరి నామినేషన్ వేసే రోజు భారీ ర్యాలీ నిర్వహిస్తాం. చామలా కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి. పార్టీ ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి,రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కోమటి రెడ్డి బ్రదర్స్ నన్ను సొంత తమ్ముడిగా భావించి పని చేస్తున్నారు. నన్ను భువనగిరి ప్రజల కుటుంబ సభ్యుడిగా భావించి ఓటు వేయండి. భువనగిరి సమస్యల మీద పార్లమెంట్ లో గళం వినిపిస్తా..’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు.