NTV Telugu Site icon

KCR Comments: తెలంగాణలో మళ్లీ విజయం మనదే

Kcr..

Kcr..

తెలంగాణలో మళ్లీ విజయం మనదేనని సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఇప్పటికే 115 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను గులాబీ బాస్ ప్రకటించారు. పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఇవాళ 51 మందికి బీ-ఫారాలను అందించారు. మిగతావి తొందరలోనే అందరికి ఇస్తామని వెల్లడించారు. కాసేపట్లో ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు.

Read Also: Mobile Addiction: ఫోన్ వాడొద్దన్నందుకు తల్లిని కొట్టి చంపిన కొడుకు

అయితే, వేములవాడలో న్యాయపరమైన ఇబ్బందులతో ఆ స్థానంలో అభ్యర్ధిని మార్చాల్సి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. టిక్కెట్లు దక్కని వారు ఇబ్బంది పడొద్దని ఆయన సూచించారు. అసంతృప్తి చెందిన వారితో పార్టీ నేతలు మాట్లాడాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తల నుంచి నేతల వరకు అందరిని సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్ధుబాటు చేసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.

Read Also: Ambati Rambabu: చంద్రబాబు ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్పాలి.. టీడీపీ నాయకులు కాదు..!

కాగా, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలవలేక కుయుక్తులను పన్నుతున్నారని ప్రత్యర్థి పార్టీలపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కోపతాపాలను అభ్యర్థులను పక్కన పెట్టాలని ఆయన సూచించారు. అఫిడవిట్‌ల విషయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. సాంకేతికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు.. వనమా నాగేశ్వరరావు, కృష్ణమోహన్ రెడ్డిలపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరమని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.