NTV Telugu Site icon

KTR: ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు.. న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం!

Ktr

Ktr

ఫార్ములా ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరికొద్దిసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరుకానున్నారు. ఈడీ విచారణకు ఈ నెల 7న హాజరుకావాల్సి ఉన్నా.. తాను రాలేనని కేటీఆర్‌ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఓవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్‌ ఓ ట్వీట్ చేశారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉంటుందన్నారు. త్వరలో నిజం వెల్లడి అవుతుందని, అప్పటి వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Also Read: BCCI: బీసీసీఐ కఠిన ఆంక్షలు.. ఇక నుంచి వారం రోజులు మాత్రమే!

‘భారతదేశం/తెలంగాణ/హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్‌ హోస్ట్ చేయడం మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఇ-మొబిలిటీ పరిశ్రమ నాయకులు మా నగరాన్ని ప్రశంసించడం గర్వించదగ్గ విషయం. పనికిమాలిన కేసులు, చౌకగా బురదజల్లడం, రాజకీయాలు చేయడం ద్వారా ఆ మంచి పనిని తొలగించలేవు. నాకు బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనది. నిన్న, నేడు, రేపు మరియు ఎల్లప్పుడూ ఫార్ములా ఈ రేస్‌ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టింది. బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీ ద్వారా ఫార్ములా ఈ రేస్‌ ఆపరేషన్స్ లిమిటెడ్ కి రూ. 46 కోట్లు చెల్లించబడింది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు, ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఇందులో అవినీతి, దుర్వినియోగం, మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది?. ఏదైతేనేం సీఎం రేవంత్‌ రెడ్డి చిన్న చూపు, ఆయన ఆలోచనా రహిత, ఏకపక్ష నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిన కార్యక్రమం రెండో ఏడాది రద్దు. గౌరవనీయమైన కోర్టులతో సహా అందరికీ కనిపించేలా త్వరలో నిజం వెల్లడి అవుతుందని నేను విశ్వసిస్తున్నా. అప్పటి వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని ఎక్స్‌లో కేటీఆర్‌ రాసుకొచ్చారు.

Show comments