NTV Telugu Site icon

Agent 2 : ఏజెంట్ దెబ్బకు అయోమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్

Allu Surendar

Allu Surendar

Agent 2 : అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ ఆర్మీ అయోమయంలో పడింది. సోషల్ మీడియాలో లబోదిబోమంటోంది. అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఏం సంబంధం ఉందని ఆలోచిస్తున్నారా. ఆగండి.. బన్నీ ఫ్యాన్స్ కు ఏజెంట్ సినిమాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఏజెంట్ సినిమా ఇప్పుడు అల్లు ఆర్మీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Read Also:Gold-Silver Price: నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

అసలు సంగతేంటంటే త్వరలోనే అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త రావడమే ఆలస్యం బన్నీ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. మాకు ఏజెంట్-2 వద్దు బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. నిజానికి మొన్నటివరకు ఈ కాంబినేషన్ పై పాజిటివ్ వైబ్రేషన్ నడిచింది. మరో రేసుగుర్రం అవుతుందని భావించారు. ఈ స్టైలిష్ కాంబో కలిస్తే మరోసారి బాక్సులు బద్దలవుతాయని అభిమానులు ఆనందించారు. ఎప్పుడైతే ఏజంట్ సినిమా ఫ్లాప్ అయిందో, అప్పట్నుంచి సురేందర్ రెడ్డితో అసలు సినిమానే వద్దంటూ అల్లు అర్జున్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులు వేడుకుంటున్నారు. గతంలో ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా బన్నీ-కొరటాల కాంబోపై ఇలాంటి నిరసనలే వ్యక్త మయ్యాయి.

Read Also:Pushpa 2: ఇండియా సినిమాల్లో రికార్డు.. పుష్ప 2 ఆడియో రైట్స్ కు భారీ ఆఫర్

ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ మొత్తం పుష్ప-2 పైనే ఉంది. ఆ మూవీ తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనేది ప్రస్తుతానికి ఇంకా తెలియదు. దర్శకుల లిస్ట్ లో ముందుగా త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత వేణు శ్రీరామ్, సందీప్ రెడ్డి వంగ పేర్లు ఉన్నాయి. వీళ్లందరితో తీసినా పర్లేదు కానీ ఫ్యాన్స్ మాత్రం సురేందర్ రెడ్డితో వద్దంటున్నారు.

Show comments