NTV Telugu Site icon

Ponnam Prabhakar : రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పునరుద్ధరింపబడిన బస్టాండ్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సంవత్సరంలో 4 కోట్ల 500 రూపాయల విలువ గల 134 కోట్ల మంది మహిళలను క్షేమముగా గమ్య స్థానాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలోని 169 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. హుస్నాబాద్ డిపో లాభాల్లో నడవడం శుభసూచకం, 600 ఆర్టీసీ బస్సులను మహిళ సంఘాల ద్వారా కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్ లను ఏర్పాటు చేశామని, ఆర్టీసీలో సమస్యలు పరిష్కరించి, కారుణ్య నియామకాలు చేపడుతున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. కార్గో సర్వీసుల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Tata Car: రూ. 6.20 లక్షల ధర.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. ఈ టాటా కారు పేరిట మరో రికార్డు