NTV Telugu Site icon

Daaku Maharaaj: తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ పై నాగ వంశీ కీలక ప్రకటన..

Naga Vamsi

Naga Vamsi

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సహ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేయగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అలాగే ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మొన్ననే ఈ సినిమా టికెట్ ధర పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. స్కూల్‌లోనే కుప్పకూలిన చిన్నారి..

‘రిలీజ్ రోజు అంటే జనవరి 12 తెల్లవారుజామున 4 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500 గా నిర్ణయించారు. అలాగే రిలీజ్ నాటి నుండి జనవరి 25 వరకు సింగిల్ స్క్రీన్స్ లో రోజుకి 5 షోస్ కు అనుమతి ఇచ్చారు. అలాగే రెగ్యులర్ షోస్ కు మల్టీప్లెక్స్ టికెట్‌ ధరపై పై రూ. 135, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 110 పెంచుతూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే తెలంగాణలో రేట్లు ఎలా ఉంటాయో? అని సందిగ్ధత కొనసాగుతున్న సందిగ్ధతకు బ్రేకులు వేస్తూ నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడిగే ఉద్దేశం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక మరోపక్క డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.

Read Also: Borewell Incident: బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి.. 34 గంటల రెస్య్కూ విఫలం..

Show comments