NTV Telugu Site icon

Real Bahubali: రియల్ బాహుబలి.. 15వేల కిలోల ట్రక్కును పళ్లతో లాగి రికార్డు

Teeth

Teeth

Real Bahubali: ఈజిప్టులో ఓ వ్యక్తి ఏకంగా 15,730కిలోల బ‌రువుతో కూడిన ట్రక్కును తాడు సాయంతో త‌న పళ్లతో ముందుకు లాగి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డును న‌మోదు చేశారు. ఈజిప్ట్ కి చెందిన అష్రాఫ్ మహ్రౌస్ మహమ్మద్ సులీమాన్ పళ్లతో అత్యంత బరువైన రోడ్డు వాహనాన్ని లాగిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ బృందం గుర్తించింది. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ప్రకటించింది. పళ్లతో ట్రక్కును లాగుతున్న వీడియోను సైతం పోస్ట్ చేసింది.

Read Also: KTR: కామారెడ్డి ఇష్యూ పై స్పందించిన కేటీఆర్.. అభ్యంతరాలు వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి

రెండు రోజుల క్రితం ఈ విషయాన్ని ప్రకటించగా, 24,961 లైక్ లు వచ్చాయి. దీనిపై ఓ యూజర్ హాస్యంగా స్పందించాడు. ‘ఆయన్ను చూసే డెంటిస్ట్ ఎవరో కానీ, నేను కూడా వెంటనే వెళ్లి కలవాలి’ అని కామెంట్ చేశాడు. ఆయన దంతాలే ఆయనకున్న బలం, ఆయన దంతాలే ఆయన కండరాలు, నా చేతుల కంటే ఆయన దంతాలే గట్టివి, అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వీడియో షేర్ చేయగా ఇప్పటికి నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి. 24,961 మంది ఈ వీడియోను లైక్ చేశారు.

 

 

Show comments