Site icon NTV Telugu

Pat Cummins: కమిన్స్ డ్యాన్స్ ఎలా చేస్తున్నాడో చూడండి.. వీడియో వైరల్

Cummins

Cummins

ఐపీఎల్ 2024లో పాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. కమిన్స్ ప్రదర్శనతో పాటు, చాలా ముఖ్యాంశాల్లో నిలుస్తున్నాడు. తాజాగా.. కమిన్స్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పాట్ కమిన్స్ దేశీ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.

Lucky Boy: కాస్త ఆలస్యమైనా పిల్లడు ఉండేవాడు కాదు.. వైరల్ వీడియో..

వైరల్ వీడియోలో.. షాహిద్ కపూర్ మరియు కృతి సనన్ నటించిన ‘తేరీ బాటన్ మే ఉల్జా జియా’చిత్రంలోని లాల్ పీలీ అఖియాన్ పాటకు పాట్ కమ్మిన్స్ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఒక వినియోగదారు ‘X’లో షేర్ చేశారు. కాగా.. ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. అంతేకాకుండా.. లక్షలాది మంది లైక్ చేశారు. ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ స్టెప్పులు వేయడంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

AP Weather: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

ఈ వీడియో లక్నోతో ఆడిన మ్యాచ్‌కి ముందుది. ఈ వీడియోలో కమిన్స్ డ్యాన్స్ చూసి ప్రశంసిస్తుండగా, మంచి స్టెప్పులేశాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్ వైపు మరో అడుగు వేసింది.

 

Exit mobile version