NTV Telugu Site icon

Viral Video: ఇంట్లో బెడ్ అనుకున్నావా నాయనా.. రైలు పట్టాలపై ఎలా నిద్రపోతున్నాడో చూడండి

Viral

Viral

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్ పై పడుకున్నట్లు.. రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అది కూడా.. కింద టవల్, పైన గొడుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ట్రాక్‌పై నిద్రిస్తున్న లోకో పైలట్‌ సకాలంలో చూసి బ్రేకులు వేసి అతని ప్రాణాలు కాపాడాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Kiccha Sudeep: అయ్యబాబోయ్.. హీరో సుదీప్‌కు ఇంత పెద్ద కూతురా..? హీరోయిన్‌ లు కూడా పనికి రారుగా..

ఈ వీడియోలో.. ఓ వ్యక్తి రైలు పట్టాలపై గాడనిద్రలో ఉన్నట్లు కనిపిస్తోంది. కింద టవల్, పైన ఎండ కొట్టకుండా గొడుగు పెట్టుకుని దర్జాగా పడుకున్నాడు. పట్టాలపై అతన్ని చూసిన లోకో పైలట్ అతనిని నిద్ర లేపాడు. అనంతరం.. ట్రాక్ నుండి అతనిని తప్పించడంతో.. రైలు ముందుకి కదిలింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ వైరల్ వీడియో ప్రయాగ్‌రాజ్‌లోని మౌయిమా రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగినట్లు తేలింది. గురువారం మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్ నుంచి మౌయిమా మీదుగా ప్రతాప్‌గఢ్ వైపు రైలు వెళ్తోంది. ఇంతలో రైలు రైల్వే క్రాసింగ్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ వద్దకు రాగానే లోకో పైలట్ ట్రాక్‌పై ఓ వ్యక్తి పడి ఉండడం చూశాడు. దీంతో.. అలర్ట్ అయి సకాలంలో రైలును ఆపి అతని వద్దకు చేరుకున్నాడు.

Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కీలక అంశాలివే..

పని చేసి అలసిపోయిన ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై టవల్, గొడుగు పెట్టుకుని నిద్రిస్తున్నాడు. డ్రైవర్ అతడిని నిద్రలేపి ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకెళ్లాడు. తర్వాత రైలు అక్కడి నుంచి కదిలింది. ఈ ఘటనపై స్పందించిన మౌయిమా రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ తనకు ఈ విషయం తెలియదని అన్నారు. కాగా.. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వ్యక్తి ఎవరనేది తెలియలేదు. కాగా.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. కామెంట్స్ కూడా చేస్తున్నారు.

 

Show comments