Greg Abel: బిజినెస్ ప్రపంచంలో “వారెన్ బఫెట్” అనే పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, అందుకున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా ఆయన్ను గుర్తించే విధంగా చేశాయి. బెర్క్‌షైర్ హాత్‌వే సంస్థను నిర్మించి, దాన్ని ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన బఫెట్ ప్రస్తుతం 94 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన ఈ సంస్థకు నాయకత్వం వహిస్తూ వ్యాపార రంగంలో అపురూపమైన ముద్రవేశారు. గత పది ఏళ్లుగా బఫెట్ వారసుడి ఎంపికపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ, బఫెట్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే వారసుడిని అధికారికంగా ప్రకటించారు. బెర్క్‌షైర్ హాత్‌వే వైస్ చైర్మన్‌గా సేవలందిస్తున్న గ్రెగ్ అబెల్‌ను వారసుడిగా ఎంపిక చేసినట్లు బఫెట్ తెలిపారు. బోర్డు కూడా ఈ ఎంపికను అంగీకరించినట్లు వెల్లడించారు.
Read Also: MS Dhoni: ఎంఎస్ ధోనీని ఔట్ చేయడంలో మరే ఉద్దేశం లేదు: భారత బౌలర్
గ్రెగ్ అబెల్‌తో పాటు మరో వైస్ చైర్మన్ అజిత్ జైన్ పేరును కూడా పరిశీలించారని బఫెట్ చెప్పారు. అయితే, అజిత్ జైన్ వయసు ఇప్పటికే 69 ఏళ్లు కావడంతో, 62 ఏళ్ల వయసున్న అబెల్‌ను వారసుడిగా నిర్ణయించారు. ఎంతో కాలంగా కంపెనీకి కీలక నాయకుడిగా సేవలందిస్తున్న అబెల్‌నే చివరకు బఫెట్ వారసుడిగా ఎంపిక చేశారు. ఇక అసలు ఎవరు ఈ ‘గ్రెగ్ అబెల్’ అన్న విషయానికి వెళ్తే.. ఈయన కెనడాలోని ఆల్బెర్టా రాష్ట్రం ఎడ్మంటన్‌లో జన్మించారు. చిన్నతనంలో బాటిళ్లు సేకరించడం, అగ్నిమాపక యంత్రాలు సర్వీసింగ్ చేయడం వంటి పని చేసేవారు. అలా 1984లో ఆల్బెర్టా యూనివర్శిటీ నుంచి ఆనర్స్ డిగ్రీని పొందారు.
Read Also: Rahul Gandhi: “శ్రీరాముడి”పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిందూ వ్యతిరేకి’’ అని బీజేపీ విమర్శలు..
తన కెరీర్‌ను అబెల్ ప్రైస్‌వాటర్ హౌస్‌కూపర్స్‌లో ప్రారంభించారు. తర్వాత కాల్‌ఎనర్జీకి మారి, అక్కడ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి.. అదే ఏడాది బెర్క్‌షైర్ హాత్‌వే సంస్థలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. తర్వాత కంపెనీ పేరు “బెర్క్‌షైర్ హాత్‌వే ఎనర్జీ”గా మార్చబడింది. ఇలా సంస్థ అభివృద్ధిలో అబెల్ కీలకపాత్ర పోషించారు. ఇక బెర్క్‌షైర్ హాత్‌వేలో గ్రెగ్ అబెల్ వివిధ విభాగాలను పర్యవేక్షిస్తారు. ఆయన నాయకత్వంలో BNSF రైల్వే, డైరీ క్వీన్ వంటి అనుబంధ సంస్థలు అభివృద్ధి చెందాయి. దీనితో ఇప్పుడు ఆయనకు అధికారికంగా సంస్థ సీఈఓ బాధ్యతలు అప్పగించబోతున్నారు.
