NTV Telugu Site icon

IPL 2023 : బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న వార్నర్.. 10 ఓవర్లకు స్కోర్..?

David Warner

David Warner

ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లకు 223/3 పరుగులు చేసింది. దీంతో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఢిల్లీ జ‌ట్టుకు ఆదిలోనే గట్టి షాక్ త‌గిలింది. ఓపెనర్ పృథ్వీ షా(5) ఔట్ అయ్యాడు. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రాయుడు క్యాచ్ అందుకోవ‌డంతో పృథ్వీ షా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 5 ప‌రుగుల‌(1.3వ ఓవ‌ర్‌)కే తొలి వికెట్ కోల్పోయింది. దీంతో దీపక్ చహార్ ఢిల్లీకి వ‌రుస షాక్‌లు ఇచ్చాడు. వ‌రుస బంతుల్లో సాల్ట్‌, రూసోను దీపక్ చహార్ ఔట్ చేశాడు.

Also Read : Kerala: 10వ తరగతి టాపర్‌గా సారంగ్.. చనిపోయి ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు..

ఐదో ఓవ‌ర్‌ను దీప‌క్ చాహ‌ర్ వేయ‌గా నాలుగో బంతికి ఫిలిఫ్ సాల్ట్ (5) ర‌హానే చేతికి చిక్కగా, ఐదో బంతికి రిలీ రూసో(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 26 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఇక.. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తనకు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఢిల్లీ స్కోర్ నెమ్మదిగా సాగుతుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 10 ఓవర్లకు కేవలం 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 31 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

Also Read : MSDhoni: ధోని భయ్యా.. నీ క్రేజ్ కో దండం.. బాల్స్ వేసేందుకు భయపడుతున్నారు!

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ఇద్దరు అర్థ శతకాలతో చెలరేగారు. దీంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 79 పరుగులు ) హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్ తో 87 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేశారు. వీరికి తోడు శివమ్ దూబే ( 9 బంతుల్లో 3 సిక్సులతో 22 పరుగులు ) కూడా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు చివర్లో రవీంద్ర జడేజా ( 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు ) అద్భుతమైన షాట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగులు మార్క్ ను ధాటింది. అయితే ఢిల్లీ బౌల‌ర‌ల్లో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.