Warangal Airport: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూరులో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న కసరత్తులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపగా, తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది.
ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. విమాన ప్రయాణాల విస్తరణ, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధికి మామునూరు ఎయిర్‌పోర్ట్ కీలకంగా మారనుంది. కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని పనులను వేగంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే తెలంగాణలో మరొక ప్రధాన ఎయిర్‌పోర్ట్ ఏర్పడి, ప్రజలకు మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అనుమతులతో పాటు, అవసరమైన భూ సమీకరణ, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
MLC Kavitha : రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు