Marri Janardhan Reddy : నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయాలు మంచి కాకరేపుతున్నాయి. ముఖ్యనేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గంలోని మార్కండేయ రిజర్వాయర్ దగ్గర తలెత్తిన ఘర్షణ పొలిటికల్ హీట్ కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ సభను బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభను ఉద్దేశించి నాగర్ కర్నూల్ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. జిల్లా ప్రజలకు ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయని నాగం జనార్దన్ రెడ్డి.. ఏ పేరుతో దళిత గిరిజన సభ నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి 21 సీట్ల కంటే ఎక్కువగా సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
Read Also: Noro Virus : ఎర్నాకులంలో నోరో వైరస్ నిర్ధారణ.. 19 మంది విద్యార్థులకు అనారోగ్యం
నాగం కాటేసే పాము లాంటి వాడు.. తాను నీడను ఇచ్చే మర్రి చెట్టు లాంటి వాడినని.. కాటేసే పాముకావాలో నీడనిచ్చే చెట్టుకావాలో తేల్చుకోవాలంటూ ప్రజలకి సూచించారు. ఆరు నెలల్లో ఈ మార్కండేయ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా.. లేదంటే ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేయనన్నారు. ‘ఓటు కు నోటు’ ద్వారా దొరికిన రేవంత్ కు తనకు బిజినపల్లి చౌరస్తా రహస్య ఓటింగ్ పెడుదాం రా…! అంటూ పిలుపునిచ్చారు. తన లెక్క బియ్యం లారీలు అమ్ముకోలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దమ్ము ధైర్యం ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. నాగం పోటీ చేస్తేనే తనకు కిక్కు వస్తుందని ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూల్ లో అన్ని విధాల వెనకబాటు కారణం నాగం జనార్దన్ రెడ్డి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Read Also : Kanti Velugu : ‘కంటి వెలుగు’తో ప్రపంచ రికార్డు సాధించాలి: సీఎస్ శాంతికుమారి