West Bengal: బెంగాల్ అసెంబ్లీలో రగడ.. సభలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. సోమవారం నాడు సభలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా బీర్బూమ్ ఘటనపై సీఎం మమత మాట్లాడాలని బీజేపీ నేతలు పట్టుబట్టడం టీఎంసీ ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పించింది.
ఇటీవల బీర్బూమ్‌లో టీఎంసీ నేత హత్యతో అల్లర్లు చేలరేగి హింసకు దారి తీసింది. దీంతో అధికార పార్టీ నేతలు ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పంటించడంతో ఈ ఘటనలో 8 మంది సజీవదహనం అయ్యారు. ఈ వివాదంపై చర్చించాలని సోమవారం నాడు సభలో బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. సభ్యులను అదుపుచేయడానికి మార్షల్స్ రంగప్రవేశం చేసి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఆగ్రహించిన స్పీకర్ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
Also Read
కాగా అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ నేతలు ట్విట్టర్లో షేర్ చేశారు. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Absolute pandemonium in the West Bengal Assembly. After Bengal Governor, TMC MLAs now assault BJP MLAs, including Chief Whip Manoj Tigga, as they were demanding a discussion on the Rampurhat massacre on the floor of the house.
What is Mamata Banerjee trying to hide? pic.twitter.com/umyJhp0jnE
— Amit Malviya (@amitmalviya) March 28, 2022
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు