Site icon NTV Telugu

Vijayawada: బెజవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య ముదురుతున్న వార్

Vijayawada

Vijayawada

Vijayawada: బెజవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య వార్ ముదురుతోంది. టికెట్ తనకు ఇవ్వాలని దుర్గగుడికి ర్యాలీగా వెళ్లి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బల ప్రదర్శన చేయగా.. మైనార్టీలకు ఈ టికెట్ ఇవ్వక పోతే ఉరి వేసుకుంటారో, ఇంకా ఏం చేస్తారో తెలియదని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వార్నింగ్ ఇస్తున్నారు.

Read Also: Anakapalli: వాలంటీర్ దారుణ హత్య.. కారణమేంటంటే?

మైనార్టీ కార్యకర్తలు బెజవాడ పశ్చిమ టికెట్‌పై ఆందోళనలో ఉన్న మాట వాస్తవమని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ తెలిపారు. టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు ఉరి వేసుకుంటారో, ఆత్మహత్యలు చేసుకుంటారో ఏం చేస్తారో కూడా తెలియదన్నారు. చంద్రబాబు ఈ టికెట్ మైనార్టీలకు ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. పవన్‌కు కూడా కలిసి సహకరించాలని ఇక్కడ పరిస్థితి వివరించానన్నారు. జనసేన పొత్తులో ఈ టికెట్‌ను వదిలిపెట్టాలన్నారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు మైనార్టీలకు ఇక్కడ తప్ప సీటు ఇచ్చే అవకాశం లేదన్నారు. టీడీపీ చరిత్రలో రాని ఓట్లు గత ఎన్నికల్లో మా అమ్మాయి అభ్యర్థిగా ఉంటే వచ్చాయన్నారు. గతంలో చంద్రబాబు మంత్రి పదవి అడిగాను, వేరే కారణాలతో ఆయన ఇవ్వలేదన్నారు.

Read Also: Actor Shivaji: ఏ పార్టీ నాకు చుట్టం కాదు.. తప్పు చేస్తే ఎవ్వరినైనా..

తాను అభివృద్ది కోసం టీడీపీలో అప్పట్లో జాయిన్ అయ్యానని.. మా పార్టీలో టికెట్లు అడిగే వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సమయంలో టికెట్లను చాలా మంది నాయకులు అడుగుతారు, అది వాళ్ళ హక్కు అని జలీల్ ఖాన్‌ పేర్కొన్నారు. పార్టీ మాత్రం గెలుపు గుర్రాలకు టికెట్లను ఇస్తుందన్నారు. ఈ మైనార్టీ సీటు జిల్లాను ప్రభావితం చేస్తుందని జలీల్ ఖాన్ అన్నారు.

Exit mobile version