Pan Card Address Change: ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు కోసం ఒక ముఖ్యమైన కార్డుగా పరిగణింప బడుతుంది. పన్నులు చెల్లించడానికి, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, భారీ లావాదేవీలు చేయడానికి అలాగే కొన్ని ప్రభుత్వ సేవలను పొందేందుకు ఇది ఉపయోగించబడుతుంది. అయితే పాన్ కార్డులో చిరునామా సరైనది కావడం ముఖ్యం. ఎందుకంటే, పన్ను నోటీసులు లేదా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సమస్యలను కలిగిస్తుంది. అయితే మీరు మీ పాన్ కార్డులో చిరునామాను మార్చాలనుకుంటే ఇలా చేయండి.
Prajavani Program: నేడు గాంధీ భవన్ లో ప్రజావాణి.. ఫిర్యాదులు స్వీకరించనున్న మంత్రి సీతక్క
మీ పాన్ కార్డు చిరునామాను మార్చడానికి, ముందుగా NSDL అధికారిక వెబ్‌సైట్ www.onlineservices.nsdl.com కి వెళ్లి, ‘పాన్ కరెక్షన్’ ఎంపికను ఎంచుకోండి. దీని తర్వాత ఫారమ్‌ను పూర్తి చేసి, కొత్త చిరునామా రుజువు కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా విద్యుత్ బిల్లు వంటి స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయండి. అప్లికేషన్ పూర్తయిన తర్వాత, రూ. 110 చెల్లించాల్సి ఉంటుంది. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ , నెట్ బ్యాంకింగ్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఈ పేమెంట్ చేయవచ్చు. పాన్ కార్డులోని చిరునామాను మార్చడానికి, ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత దానిని సమర్పించండి. దీని తర్వాత మీరు ఆధార్ కార్డ్ నుండి e-KYC ద్వారా డిజిటల్ సంతకం చేయవచ్చు. లేదా ఫారమ్‌ను ప్రింట్ చేసి NSDLకి పంపవచ్చు. మీరు మీ దరఖాస్తును సమర్పించిన తర్వాత, మీరు NSDL వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. విజయవంతమైన ధృవీకరణ తర్వాత, కొత్త పాన్ కార్డ్ మీ కొత్త చిరునామాకు పోస్ట్ ద్వారా పంపబడుతుంది.
Rape On Dead Body: ఛీ.. ఛీ.. సమాధి నుండి బాలిక మృతదేహాన్ని తీసి అత్యాచారం చేసిన యువకులు