ప్రస్తుతం వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సరికొత్త కథలతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పలు ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్ లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాయి. తెలుగులో కూడా మేకర్స్ వెబ్ సిరీస్ లను రూపొందించేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. పలువురు నిర్మాతలు ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాత మరియు నటి అయిన సుప్రియ యార్లగడ్డ ‘వ్యూహం’ అనే క్రైమ్ థ్రిల్లర్ ను నిర్మించింది. శశికాంత్ శ్రీవైష్ణవ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు.
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి సుశాంత్ ప్రధాన పాత్ర లో ఈ సిరీస్ రూపొందింది. చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్ మరియు శశాంక్ సిద్దంశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.డిసెంబర్ 14 న స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ యాక్సిడెంట్ లో చనిపోయిన ప్రెగ్నెంట్ లేడీ నుంచి స్టోరీ మొదలు అవుతుంది. ఈ కేసు విచారణ క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఈ యాక్సిడెంట్ కు టెర్రరిస్టుల, మావోయిస్టుల సంబంధం ఉన్నట్లు ఈ సిరీస్ లో చూపించడం జరుగుతుంది.. ఈ యాక్సిడెంట్ కు వారికి వున్న సంబంధం ఏంటి..పోలీస్ ఆఫీసర్ గా హీరో విచారణ లో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఈ సిరీస్ లో చూపించారు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వ్యూహం వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ తో రూపొందింది..