VVS Laxman: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VVS Laxman: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా హైదరాబాదీ సొగసరి ఆటగాడు వీవీఎస్ లక్ష్మ ణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే, కేవలం న్యూజిలాండ్ టూర్‌కు మాత్రమే ఆయన హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. నవంబర్ 30న న్యూజిలాండ్ టూర్ ముగిసేవరకు ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విశ్రాంతి తీసుకోనున్నారు. టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తుండగా, లక్ష్మణ్ కోచ్‌గా శిఖర్ ధావన్ వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వెల్లింగ్టన్‌లో మొదటి టీ20 సందర్భంగా లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఇండియా సన్నాహాలతో పాటు ముందున్న సవాళ్ల గురించి మాట్లాడాడు.
భారత క్రికెటర్లు అద్భుతంగా ఆడుతున్నారని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. ఇక్కడ మనకు చాలా మంది ఆటగాళ్లు ఉన్నారన్నారు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఆయన.. నిర్దిష్ట ఆటగాళ్లకు అప్పుడప్పుడు విరామం ఇవ్వాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆటగాళ్ళు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా పునరుత్తేజం పొందేందుకు విరామాలు చాలా ముఖ్యమన్నారు. మీ వైట్-బాల్ క్రికెట్‌లో స్పెషలిస్ట్ ప్లేయర్‌లు అవసరమని ఆయన అన్నారు. టీ20లో చాలా మంది టీ20 స్పెషలిస్ట్‌లు కనిపిస్తారని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమిని చవిచూసిన భారత్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
Also Read
ICC T20I Rankings: నంబర్ వన్ స్థానం సూర్యకుమార్ యాదవ్‌దే..
కెప్టెన్‌గా హార్దిక్ గురించి మాట్లాడుతూ లక్ష్మణ్ ఇలా అన్నాడు: “అతను అద్భుతమైన నాయకుడు. అతను ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఏమి చేసాడో చూశాము. టోర్నమెంట్‌లో ఫ్రాంచైజీకి మొదటి సంవత్సరంలో నాయకత్వం వహించడంతో పాటు లీగ్‌ను కూడా గెలిచాడు. ఐర్లాండ్ సిరీస్ నుంచి నేను అతనితో చాలా సమయం గడిపాను, అతను వ్యూహాత్మకంగా మాత్రమే కాదు, అతను మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అత్యున్నత స్థాయిలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అతను చాలా సన్నిహితంగా ఉంటాడు. ఆటగాళ్లందరూ అతని వద్దకు వెళ్లి అతనితో నమ్మకంగా మాట్లాడతారు. నేను హార్దిక్‌లో నిజంగా ఇష్టపడే విషయం అని నేను అనుకుంటున్నాను.” అని లక్ష్మణ్ వెల్లడించారు. ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉన్నా హార్దిక్ ప్రశాంతంగా ఉంటాడని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. హార్దిక్ ఆటగాళ్ల కెప్టెన్ అని తాను అనుకుంటున్నానన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు