NTV Telugu Site icon

India Head Coach: గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త కోచ్!

Gautam Gambhir

Gautam Gambhir

న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్‌ 8 నుంచి 15 వరకు 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ టీ20 సిరీస్ కోసం ఇటీవలే బీసీసీఐ జట్టును ప్రకటించింది. భారత జట్టు కోచింగ్ బాధ్యతలను భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్‌ వీవీఎస్ లక్ష్మణ్ అందుకోనున్నాడని తెలిసింది. లక్ష్మణ్ గతంలో కూడా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్‌ మూడో వారం (నవంబర్ 22) నుంచి మొదలుకానుంది. రోహిత్ సేన నవంబర్ 10న ఆసీస్ బయలుదేరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటనతో రెగ్యులర్​ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బిజీగా అవ్వనున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో సిరీస్​ నవంబర్ 8 నుంచి ఆరంభం అవుతుంది. రెండు సిరీస్​లు క్లాష్ అవ్వడంతో.. దక్షిణాప్రికా సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించడం గంభీర్‌కు సాధ్యపడదు. అందుకే వీవీఎస్ లక్ష్మణ్‌కు తాత్కాలిక కోచ్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించనుంది.

వీవీఎస్ లక్ష్మణ్‌కు సహాయక కోచింగ్ సిబ్బందిగా ఎన్సీఏలో ఇతర కోచ్‌లు సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కంటికర్, శుభదీప్ ఘోష్ ఉండనున్నారు. ఎమర్జింగ్ ఆసియా టీ20 కప్‌ కోసం భారత-ఏ జట్టుకు సాయిరాజ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టును సూర్యకుమార్‌ యాదవ్‌ నడిపించనున్నాడు.

Also Read: Best Electric Cars 2024: 10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. ఫుల్‌ ఛార్జింగ్‌పై 365 కిలోమీటర్ల ప్రయాణం!

భారత్ టీ20 జట్టు:
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, యశ్‌ దయాల్‌.