ప్రజలకు సేవ చేయాల్సింది పోయి చేతులెత్తింది. అధికారిణి అన్న విషయం మరిచిపోయి చెలరేగింది. ఏపీలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో తీవ్ర స్థాయిలో వరదలు చుట్టు ముట్టాయి. దీంతో.. జనాలు బయటకుపోలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి జనాలు కోలుకుంటున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరి నానా తంటాలు పడుతున్నారు. అయితే.. నిత్యవసర సరుకులు పంచడానికి వచ్చిన మహిళా వీఆర్వో ఓ వ్యక్తిపై చేయి చేసుకుంది.
Read Also: Box Office: రచ్చ రేపుతున్న శనివారం.. పాపం గోట్!
వివరాల్లోకి వెళ్తే.. వరదల నుంచి కోలుకుంటున్న ఓ గ్రామాన్ని పరిశీలించడానికి వచ్చిన వీఆర్వో, వరద బాధితుడిపై చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటన అజిత్ సింగ్ నగర్ షాది ఖానా రోడ్డులో జరిగింది. వరదలు వచ్చినప్పటీ నుంచి ఫుడ్, కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చెప్పినా.. సచివాలయం 259 వార్డు వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీంతో.. ఇదే విషయంపై వాగ్వివాదం జరగటంతో స్థానికుడిపై ఆగ్రహంతో వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది. ఆ అధికారి ఓ వ్యక్తిని చెంపపై కొట్టడాన్ని అక్కడున్న కొందరిలో వీడియో తీశారు. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. స్థానికులపై దుర్భాషలాడుతూ ప్రవర్తించింది. అంతేకాకుండా.. తన భర్తను తీసుకొచ్చి బెదిరిస్తుందని ఆరోపించారు. అక్కడున్న పోలీసులు ఏమీ పట్టించుకోకుండా.. వీఆర్వోకే సపోర్ట్ చేస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని.. వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వరద బాధితుడికి వీఆర్వో చెంపదెబ్బ..విజయవాడ అజిత్ సింగ్ నగర్ షాది ఖానా రోడ్డులో ఘటన..#Vijayawada #VijayawadaFloods #VRO #Floodrelief #apfloods #TeluguNews #NTVTelugu pic.twitter.com/1O1oru0UnY
— NTV Telugu (@NtvTeluguLive) September 9, 2024
Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరికి బెయిల్..