Site icon NTV Telugu

Suchata Chuangsri: తెలంగాణ లో సోషల్ సర్వీస్ చేస్తా.. మిస్ వరల్డ్ కీలక వ్యాఖ్యలు…

Suchata Chuangsri

Suchata Chuangsri

మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటాన్ని థాయ్‌లాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత సొంతం చేసుకున్నారు. 72 వ మిస్ వరల్డ్ గా అవతరించిన మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత నిలిచారు. తన అందం, ఆత్మవిశ్వాసంతో పోటీలో రాణించిన సుచాత.. పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. సుచాత 16 ఏళ్లకే బ్రేస్ట్ క్యాన్సర్ పై పోరాడారు. బ్యూటీ విత్ పర్పస్ లో భాగంగా సుచాత బ్రేస్ట్ క్యాన్సర్ రోగుల పక్షాన నిలిచారు. రానా దగ్గుబాటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ యాక్షన్ స్పీక్స్ మోర్ ధాన్ నాయిస్ అంటూ సమాధానం ఇచ్చారు.

READ MORE: Bonalu Festival: దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజ బోనాలు.. హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

ఓపల్ సుచాత 2024 మిస్ యూనివర్స్ మూడవ రన్నరప్ గా నిలిచారు. ఈ విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. బ్యూటీ విత్ పర్పస్ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ ఆతిథ్యానికి రుణపడి ఉంటానని చెప్పారు. తెలంగాణ లో సోషల్ సర్వీస్ చేస్తాన్నారు. కిరీటం అందుకునే సమయంలో భావోద్వేగానికి లోనైనానట్లు వెల్లడించారు. తెలంగాణ టూరిజంని ప్రమోట్ చెయ్యటం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మిస్‌ వరల్డ్‌ కావాలన్నది తన కల అని.. తన కల నెరవేరిందన్నారు.. హైదరాబాద్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. తెలంగాణ ఆతిథ్యం బాగుందని కొనియాడారు.. చౌమహల్లా ప్యాలెస్‌, పిల్లలమర్రి చాలా బాగున్నాయన్నారు.. ఓపల్ ఫర్‌ హర్‌ ప్రాజెక్టు కోసం మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు.

READ MORE: Sharmishta Panoli: శర్మిష్ట పనోలి ఎవరు.? మమతా సర్కార్ ఎందుకు అరెస్ట్ చేసింది..

Exit mobile version