NTV Telugu Site icon

Volunteer: రైల్వేపట్టాలపై వాలంటీర్‌ మృతదేహం.. అసలేం జరిగిందంటే?

Volunter Suicide

Volunter Suicide

Volunteer: విజయనగరం జిల్లా బొబ్బిలి గున్నతోట వలస సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం రేపింది. ఆ మృతదేహం బొబ్బిలి పట్టణానికి చెందిన సచివాలయ వాలంటీర్ కిలారి నాగరాజుగా గుర్తించారు. కుటుంబ కలహాలతో‌ వాలంటీర్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. నాగరాజు భార్యతో కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నాడని బంధువులు తెలిపారు. నాగరాజు తల్లి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది.

Read Also: Rinky chakma: చిన్న వయసులోనే మాజీ మిస్ ఇండియా చక్మా కన్నుమూత

పెన్షన్ పంపిణీ కోసం వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి వాలంటీర్ నాగరాజు 75 వేలు తీసుకున్నాడు.మృతుడు నాగరాజు జేబులో 25వేలు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో మిగిలిన యాభైవేల రూపాయల వ్యవహారంపై స్పష్టత లేదని పోలీసులు వెల్లడించారు. విధులు నిర్వహించడంలో ఎప్పుడూ అలసత్వం లేదని అధికారులు చెబుతున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండొంచని పోలీసులు అనుమానం వ్యక్తం చేసున్నారు.