NTV Telugu Site icon

Volunteer: వెలుగులోకి మరో వాలంటీర్‌ అరాచకం.. యువతిపై అఘాయిత్యం.. ఆపై..!

Rape

Rape

Volunteer: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది వైసీపీ సర్కార్‌.. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను గడప వద్దకే ఈ వ్యవస్థ ద్వారా అందజేస్తున్నారు.. ఇక, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.. అయితే, ఇదే సమయంలో వాలంటీర్‌ వ్యవస్థపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి.. వాలంటీర్లు అరాచకాలకు పాల్పడుతున్నారు.. మానవ అక్రమ రవాణాలో వారి పాత్ర ఉందనే సంచలన ఆరోపణలు కూడా వినిపించాయి..

Read Also: BPCL: ఒకప్పుడు ప్రభుత్వం అమ్మాలనుకుంది.. కానీ ఈ 90రోజుల్లో రూ.8500 కోట్లు సంపాదించింది

అయితే, తాజాగా ఏలూరులో వాలంటీర్‌ వ్యవహారం సంచలనంగా మారింది.. మహిళను లోబర్చుకొని వాలంటీర్‌ గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన ఓ మహిళను లోబర్చుకున్న గర్భవతిని చేశాడు వాలంటీర్ మండిగ సత్య గణేష్‌.. అయితే, విషయం బయటకొస్తుందని నెల క్రితమే ఆ వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించారు.. అప్పటి వరకు వివాహం చేసుకుంటానని చెప్పిన గణేష్‌.. తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు.. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. తీరా గర్భవతి అయ్యాక.. పెళ్లికి నిరాకరించాడు.. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. పోలవరం పోలీసులను ఆశ్రయించింది.. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, వాలంటీర్‌ వ్యవస్థపై ఓవైపు విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. మరోవైపు ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే, అలాంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించకుండా వెంటనే చర్యలకు దిగుతోన్న విషయం విదితమే.