Vodafone Idea: ప్రస్తుతం టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సంస్థను బలోపేతం చేసేందుకు సంస్థ ప్రతినిధులు కష్ట పడుతున్నారు. దేశంలో జియో, ఎయిర్ టెల్ లతో వీఐకి గట్టి పోటీ ఉంటుందని.. వాటి ద్వారా తమ సంస్థ చాలా మంది వినియోగదారులను కోల్పోయిందని ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించిన రూ.18 వేల కోట్లు వొడాఫోన్ కు పునర్జీవం లాంటి వన్నారు. మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తప్పకుండా పుంజుకుంటామని ఆయన పేర్కొన్నారు. గురువారం ఎఫ్ పీఓ లిస్టింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన 5జీ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వీఐ 2.0 ప్రారంభం కాబోతోందని స్పష్టం చేశారు. కంపెనీ పుంజుకోవడంతో ప్రభుత్వం చొరవ ఎనలేనిదన్నారు.
READ NORE: T20 World Cup: ‘టీ20 ప్రపంచకప్ గెలవాలంటే..’ కోచ్ ద్రవిడ్‌కు ప్రత్యేక సలహా ఇచ్చిన మాజీ క్రికెటర్..
ప్రభుత్వ చొరవ వల్లే టెలికాం రంగంలో మూడో స్థానంలో నిలిచామని తెలిపారు. వీఐని దేశ సంపద అన్నారు. మూలధన సమీకరణలో కంపెనీ సమస్యలు కుదటపడతాయా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇది కంపెనీని పునర్జీవం లాంటి దన్నారు. ప్రస్తుతం 21.5 కోట్ల మందికి సేవలందిస్తున్నట్లు పేర్కొ్న్నారు. ఇండస్ టవర్స్ లో వాటాల విక్రయంపై అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేదు. వొడాఫోన్ ప్రమోటర్లు, ఆదిత్యా బిర్లా గ్రూప్ కలిసి ఇప్పటి వరకు రూ.1.70 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. గత అయిదేళ్లలోనే దాదాపు రూ. 30 వేల కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కంపెనీ కొంత మేరకు పుంజుకుందని తెలిపారు. కంపెనీ అప్పులు రూ. 4 వేల కోట్లకు తగ్గయని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ మాట్లాడుతూ.. మనది పెద్ద దేశమని మన దేశానికి మూడు టెలికాం సంస్థలు అవసరమన్నారు. కంపెనీని కాపాడుకునేందుక బిర్లా తన వ్యక్తి గత సొమ్ముతోపాటు ప్రపంచంలోని పెట్టుబడిదారుల నుంచి డబ్బును పోగు చేశారని తెలిపారు. బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా స్టాక్ 5.27 శాతం లాభపడగా.. రూ.1378 వద్ద ముగిసింది.