Tehsildar Ramanaiah Case: విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. అనంత శర్మ(పూజారి )అనే వ్యక్తి ఫోన్ చేయడంతో రమణయ్య ఇంటి నుంచి కిందకి వచ్చినట్లు తెలిసింది. పూజారి వెళ్ళిపోయాక 30-35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఒక ఫైల్‌ను జాగ్రత్తగా ఉంచమని భార్యకు రమణయ్య ఇచ్చినట్లు సమాచారం. ఆ ఫైల్ విషయమై దుండగుడుతో గొడవ అయ్యి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. భార్య నుండి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.
Read Also: Teenager Kills Mother: టిఫిన్ పెట్టలేదని తల్లిని చంపిన కొడుకు..
రెక్కీ నిర్వహించి ప్లాన్ ప్రకారమే దుండగులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీధి చివర కదలికలు అప్డేట్ చేస్తూ దుండగులు గ్యాంగ్ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మాట్లాడుతూ ఒక్కసారిగా ఇనుప రాడ్‌తో ఓ వ్యక్తి తహశీల్దార్‌పై అటాక్ చేశాడు. ప్రతి రోజు విధుల నుంచి రాత్రి 10, 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే ఎమ్మార్వో రమణయ్య.. తాజాగా విజయనగరం బొండపల్లిలో ఛార్జ్ తీసుకున్నారు. మొదటి రోజు కావడంతో రాత్రి 8 గంటలకే అపార్ట్మెంట్‌కు రమణయ్య చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నలుగురు అనుమానిత నిందితులు ఉన్నారు, పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు కొనసాగుతోంది.