Site icon NTV Telugu

Swaroopanandendra Saraswati: బ్రాహ్మణజాతికి ఏ అన్యాయం జరిగినా పోరాడేది శారదాపీఠమే

బ్రాహ్మణ జాతికి ఎప్పుడూ విశాఖ శారదాపీఠం అండగా ఉంటుందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి. విజయవాడలోని గాంధీ నగర్ ఫిలిం ఛాంబర్ వద్ద సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కుంకుమార్చనకు హాజరైన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. స్వామివారికి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు,తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, కుంకుమార్చన నిర్వాహకులు గుడిపాటి సీతారామ్,భక్తులు. గురువందనం సమర్పించారు వేదపండితులు. భక్తులకు అనుగ్రహభాషణం చేశారు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ… గాంధీనగర్ ప్రాంతానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Read Also:CM JaganMohan Reddy: శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులతో జగన్ భేటీ

ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మణలున్నారు. చైత్రమాసంలో సహస్ర కుంకుమార్చన నిర్వహించడం శుభకరం.కుంకుమార్చన నిర్వహించిన గుడిపాటి సీతారామ్ కు అభినందనలు. కాషాయ జెండాలు పట్టుకుని హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నామనేలా కొందరు టీవీల్లో ,సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ వేదాలు…ఇతిహాసాలను నిలబెట్టే జాతి బ్రాహ్మణ జాతి ఒక్కటే. దేవాలయాల్లో దైవత్వాన్ని కాపాడే ఏకైక శక్తి బ్రాహ్మణ జాతి. ప్రతీ కులం వారు దైవత్వాన్ని పొందుతున్నా …ఆలయాలకు వెళుతున్నా…భక్తులుగా మారుతున్నా అది బ్రాహ్మణజాతి చేసిన త్యాగం అన్నారు. బ్రాహ్మణ జాతికి ఏ కష్టం వచ్చినా ముందుండేది విశాఖ శారదాపీఠం మాత్రమే అన్నారు. ఏ ప్రభుత్వం బ్రాహ్మణజాతికి అన్యాయం చేసినా పోరాటం చేసేది విశాఖ శారదాపీఠమే అని స్పష్టం చేశారు. బ్రాహ్మణ జాతికి ఎప్పుడూ విశాఖ శారదాపీఠం అండగా ఉంటుందన్నారు.

Read Also: CM Jagan Mohan Reddy: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో సీఎం జగన్ భేటీ

Exit mobile version