Site icon NTV Telugu

Vizag: బ్రేక్ ఫెయిల్యూరా? డ్రైవర్ తప్పిదమా? మహిళ నిండు ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సు!

Vizag Accident

Vizag Accident

Vizag: విశాఖ ద్వారాక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పలాస డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికులను బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్యూరే కారణమా లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Minister Anitha: బాబాయ్‌ను చంపిన వారికి ఓటు వేయాలా..?

ఇది ఇలా ఉండగా.. డ్రైవర్ చంద్రరావు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెబుతుండగా, ఆర్టీసీ RMO అప్పల నాయుడు మాత్రం ఇది బ్రేక్ ఫెయిల్యూర్ కాదని అంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. ఈ ప్రమాదం 4:50 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

Nidhhi Agerwal: తెలుగు హీరోయిన్‌కి ప్రభుత్వ వాహనం.. అసలు నిజం ఇదే!

మంత్రికి మాత్రం బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలియజేసిన మంత్రి, గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Exit mobile version