NTV Telugu Site icon

Fishing Harbor Fire Accident Case: బోట్ల దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం..

Fishing Harbor Fire Acciden

Fishing Harbor Fire Acciden

Fishing Harbor Fire Accident Case: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం, బోట్లు దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. ప్రధాన అనుమానితుడుగా ఉన్న యుట్యూబర్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.. ఇప్పటికే 10 మంది అనుమానితులని అదుపులోకి తీసుకున్నారట పోలీసులు.. అనుమానితులను వన్‌ టౌన్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ ఆనంద్ రెడ్డి విచారిస్తున్నారు.. యుట్యూబర్ సెల్ ఫోన్ డేటా, హార్బర్ లో అతని కదలికలపై విచారణ కొనసాగుతోంది.. వారం రోజులగా హార్బర్ లో సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయినట్టు తెలుస్తోంది.

Read Also: Uttarapradesh : పెళ్లిలో రసగుల్లా కోసం దారుణంగా కొట్టుకున్న అతిధులు.. ఆరుగురి పరిస్థితి విషమం..

మరోవైపు.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించడంతో హార్బర్ లో ప్రమాద తీవ్రత తగ్గిందని తెలిపారు వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి.. పోర్ట్, స్టీల్ ప్లాంట్.. పోలీసులు సకాలంలో స్పందించారు.. లేకుంటే ఆయిల్ ట్యాంకర్ ల నుంచి ముప్పు వుండేది.. ఇక, సీఎం జగన్ మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు.. బోటు ఖరీదు 30..50 లక్షలు అయినా అందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. పాక్షికంగా దెబ్బ తిన్న బోటు యజమానులకు మేలు జరుగుతుంది.. పరిహారం గతం మాదిరిగా ఆలస్యం కాకుండా రోజుల వ్యవధిలో పరిహారం ఇస్తాం అని ప్రకటించారు. బోటు కలాసీలు.. డ్రైవర్లకు .కూలీలను సక్రమంగా అడ్డుకోమని అధికారులను కోరాం. మునిగిపోయిన బోట్ల ను తొలగించాలని పోర్ట్ అధికారులను చెప్పామన్నారు.

Read Also: Health Tips : చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే దివ్యౌషధం..

ఇక, ఇతర బొట్లకు అడ్డం లేకుండా మునిగిన బోట్లను త్వరలో బయటకు తీస్తాం.. మత్సకారుల కస్తాలను తెలుసుకోవాలని సీఎం జగన్‌ పంపించారు.. అందుకే వచ్చను అని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.. కేవలం పరిహారం మాత్రమే కాదు ఇతర సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తాం.. ప్రమాద కారకులపై చర్యలు తీసుకుంటాం.. ఇప్పటికే అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతోంది.. సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదన్న విషయంపై విచారణ చేపట్టాలని సీపీకి కోరాం.. టీడీపీ హయాంలో హుడ్ హుడ్.. తిత్లి మాదిరిగా ఆలస్యం లేకుండా పరిహారం అందిస్తాం అని తెలిపారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.