NTV Telugu Site icon

Vizag CP: స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మూడంచెల భద్రత..

Vizag Cp

Vizag Cp

Strong Rooms: ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటుచే సిన స్ట్రాంగ్ రూములను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది.. జీరో వైలెన్స్ గా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు. ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. స్ట్రాంగ్ రూముల దగ్గర కౌంటింగ్ వరకు మూడంచెల భద్రతా ఉంటుంది అని ఆయన వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ క్యాంపస్ లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసాం.. సీసీ కెమెరాలా ద్వారా ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేస్తూ ఉంటాం.. విశాఖ ప్రజలు ఎన్నికల నిర్వహణకు పూర్తి సహకారం అందించారు అని వైజాగ్ సీపీ రవి శంకర్ అయ్యన్నర్ తెలిపారు.

Read Also: Tejasvi Surya: రాహుల్ గాంధీతో చర్చకు బీజేవైఎం సిద్ధం.. అభినవ్ ప్రకాశ్ పేరు ఖరారు

అయితే, ఉమ్మడి విశాఖపట్నంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. గత ఏడాది కంటే ఈ ఏడాది స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది అని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. గత ఎడాది 63 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ ఏడాది 68.13 శాతంకు పెరిగింది.. అనకాపల్లి జిల్లాలో 79.77 శాతం పోలింగ్, అల్లూరి జిల్లాలో 63 శాతం పోలింగ్ నమోదైందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత నడుమ పోలింగ్ నిర్వహించామని వైజాగ్ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. అలాగే, అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా చాలా చోట్ల పోలింగ్ సజావుగా సాగిందని విశాఖ సిటీ సీపీ రవి శంకర్ అన్నారు. పోలింగ్ పూర్తైన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించాము.. విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను ఆంధ్ర యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద సీలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నర్ చెప్పారు.