Site icon NTV Telugu

Vizag POCSO Court: కన్నకూతురుపై అత్యాచారం, గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు

Court

Court

Vizag POCSO Court: కన్నకూతురిని అల్లారు ముద్దుగా చూసుకావాల్సిన తండ్రే.. కామంతో ఆమె జీవితాన్ని నాశనం చేశారు.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే ఆ పిల్ల పాలిట పాపాత్ముడిగా మారాడు. ఈ హేయమైన ఘటన విశాఖపట్నం జిల్లా, మల్కాపురం ఎన్టీఆర్ కాలనీలో సంచలనం రేపిన విషయం విదితమే.. మానవసంబంధాలు, వావివరసలు మరిచి.. తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురిపై కొంతకాలం పాటు అత్యాచారం చేశాడు.. అయితే, తీరా ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగు చూసింది.. ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలనం తీర్పు వెలువరించింది.

Read Also: Pakisthan: పాకిస్థాన్ లో కొద్దీ ఇళ్లకు, చర్చిలకు నిప్పు..

కన్నకూతురుపై అత్యాచారం చేసి గర్భవతి చేసిన ఆ కామాంధుడైన తండ్రి రామచంద్రరావుకి జీవిత ఖైదు విధించింది విశాఖ పోక్సో కోర్టు.. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 28 అక్టోబర్‌ 2020న కేసు నమోదైంది.. 15 ఏళ్ల మైనర్ కూతురుపై అత్యాచారం చేయడంతో.. ఆ బాలికి గర్భం దాల్చడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు బంధువులు.. కేసు నమోదు చేసిన దిశా పోలీసులు.. విచారణ పూర్తి చేశారు.. ఇక, ఈ రోజు విశాఖ పోక్పో కోర్టు రామచంద్ర రావుకి జీవిత కాలం శిక్ష విధించింది.. బాధితురాలికి పది లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని జడ్జి ఆనంది ఆదేశించారు.. మరోవైపు.. బాధితురాలికి న్యాయం జరగడంతో.. స్పెషల్ పోక్సో కోర్టు పీపీ కరణం కృష్ణకి కన్నీటితో ధన్యవాదాలు తెలిపారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

Exit mobile version