Site icon NTV Telugu

Vizag: నేడు విశాఖలో నేవీ డే.. ఆర్కే బీచ్ లో ప్రదర్శనలు

New Project (44)

New Project (44)

Vizag: భారతదేశం – పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 న నేవీ డే జరుపుకుంటారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఏడాది మైచాంగ్ తుపాను కారణంగా 4వ తేదీన జరగాల్సిన వేడుక 10వ తేదీకి వాయిదా పడింది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆర్కే బీచ్‌లో ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. నేవీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్‌లు, జలాంతర్గాములు, హెలికాప్టర్‌లతో సిబ్బంది విన్యాసాలు చేస్తారు. దాదాపు 2 వేల మంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Read Also:Rajasthan : చండీగఢ్‌లో గోగమేడి హత్యకేసు.. నిందితుల అరెస్టు

ఈ ఏడాది నేవీ డేకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఒంటిగంటకు పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు నేవీ వ్యాయామాలకు హాజరవుతారు. సాయంత్రం 5.35 గంటల వరకు అక్కడే ఉండి, ఆ తర్వాత నేవీ హౌస్‌లో ‘ఎట్ హోమ్’ పేరుతో ఈస్టర్న్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీ పార్టీకి హాజరవుతారు. రాత్రికి తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.

Read Also:Fire Accident: బరేలీ-నైనిటాల్ హైవేపై పెను ప్రమాదం.. కారు, ట్రక్కు ఢీకొని 8 మంది సజీవ దహనం

Exit mobile version