MRO Ramanaiah Incident: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తహసిల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడి విచారణ కథ ముగిసినట్టేనా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. నిందితుడు మురారిని 14 రోజులు రిమాండ్ కు తరలించారు పోలీసులు.. అయితే, సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కస్టడి కోరకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.. తహసీల్దార్ హత్య కేసులో కేవలం మురారి హస్తమే ఉందా..? అసలు సూత్రధారులు ఇంకెవరైనా ఉన్నారా..? ఇలా రమణయ్య హత్య కేసులో వందల అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.. రమణయ్యకు నిందితుడికి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయి? కన్వేయన్స్ డీడ్ వ్యవహారమే కారణమా? ఇంకేమైనా ఉన్నాయా..? ప్రైవేట్ కంపెనీ డీల్ లో భాగంగానే నిందితుడు మధ్యవర్తిగా వ్యవహరించాడా? సుపారి పుచ్చుకొని హత్య చేశాడా? తెర వెనక ఉండి మురారిని ఉసిగొలుపిన వారు ఎవరు? వీటన్నిటికీ సమాధానం దొరక్కుండానే నిందితుడిని రిమాండ్ కు తరలించడం, విచారణ నిమిత్తం కస్టడీకి కోరకపోవడం ఎవరిని కాపాడే ప్రయత్నం? అంటూ ఎన్నో అనుమాలను వ్యక్తం చేస్తు్న్నారు.
Read Also: Tax Distribution : పన్ను పంపిణీలో కర్ణాటకకు రూ.13 ఇస్తే.. యూపీకి మాత్రం రూ.333 ఎందుకిస్తున్నారు?
అయితే, నగదు లావాదేవీల బాగోతం బయటకు వస్తే రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని ఈ కేసును ముందుకు సాగనివ్వడంలేదా? గతంలో కీలక కేసుల్లో కస్టడీ కోరిన విశాఖ పోలీసులు.. ఈ కేసులో కస్టడీ కోరకపోవడంపై పలు అనుమానాలు రేగుతున్నాయి.. హత్య నుంచి ఎస్కేప్ వరకు అంతా సినీ ఫక్కీలోనే.. ఒంటరిగానే ఆలోచించాడా..? తీసుకున్న కిరాయికి పని ముగించాడా..? నిందితుడు హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశాడా? దాడి చేసి బయపెట్టాలని చూసాడా? పోలీసులు తెర వెనుక ఉన్న సూత్రధారులను సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? రెండు టిక్కెట్లు చెన్నై కే ఎందుకు బుక్ అయ్యాయి… మేక్ మై ట్రిప్ లో ట్రైన్, ఫ్లైట్ టిక్కెట్ లు ఎవరు బుక్ చేశారు..? మూడు కోట్ల రూపాయల డీల్ అయితే అడ్వాన్స్ కింద 57 లక్షలు ఎమ్మార్వో కి ఇస్తే.. మిగిలిన వాటి సంగతేంటి..? ప్రసాద్, గంగారాం మధ్య లింకేంటి…? అన్నయ్యగా పరిచయం అయి మీడియా ముందు హడావిడి చేసిన రాజేంద్ర బ్యాక్ డోర్ వర్క్స్ తో MRO లింకులు ఏంటి…? ఇలా ఒక హత్య.. వంద ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.