50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!

  • చైనాలో వివో వై600ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన వివో.
  • 6.83 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,800 × 1,260 పిక్సెల్స్ రిజల్యూషన్.
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్‌
  • వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా.
  • 10,200mAh భారీ బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
Vivo Y600s Pro

Vivo Y600s Pro

Vivo Y600s Pro Launched: వివో (VIVO) చైనాలో Y సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను నిశ్శబ్దంగా విడుదల చేసింది. ఇప్పటికే వివో వై600ఐ (Vivo Y600i), వై600కే టర్బో (Y600k Turbo) మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా వివో వై600ఎస్ ప్రో (Vivo Y600s Pro)ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో భారీ 10,200mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారీ బ్యాటరీతో ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపికగా నిలవనుంది.

వివో వై600ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2,800 × 1,260 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 1.07 బిలియన్ రంగులు, హెచ్‌డీఆర్, పీ3 వైడ్ కలర్ గామట్ సపోర్ట్ ఉన్నాయి. డిస్‌ప్లే కిందనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. పనితీరు కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 8GB LPDDR5 ర్యామ్‌ను జత చేశారు. స్టోరేజ్ విషయానికి వస్తే 256GB, 512GB UFS 3.1 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 8GB వరకు మెమరీ ఫ్యూజన్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్‌ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు ఎఫ్/1.8 అపెర్చర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలు రెండింటికీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్ట్ అందించారు. దీనివల్ల వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు కెమెరా కదలికల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 10,200mAh బ్యాటరీ. ఇది సింగిల్ సెల్ డిజైన్‌తో రూపొందించగా, రేటెడ్ కెపాసిటీ 10,000mAhగా ఉంది. బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసేందుకు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. ఇతర డివైజ్‌లకు ఛార్జింగ్ అందించేందుకు రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

కనెక్టివిటీ ఫీచర్లలో ఎన్‌ఎఫ్‌సీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ ఉన్నాయి. మెరుగైన ఆడియో అనుభూతి కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అమర్చారు. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే మూన్‌లైట్ బ్లాక్, ఫ్లోటింగ్ గోల్డ్, స్టార్రీ పర్పుల్, వాస్ట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇవి చైనా ధరలకు సంబంధించిన వివరాలు మాత్రమే. భారత మార్కెట్లో విడుదల, ధరపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Vivo వై600ఎస్ ప్రో చైనాలో రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
* 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్: 2,699 యువాన్లు.
* 8GB ర్యామ్ + 512GB స్టోరేజ్: 2,999 యువాన్లు.