Site icon NTV Telugu

Vivo X100 Pro Launch: లాంచ్‌కు ముందే వివో ఎక్స్‌100 ప్రో ఇమేజ్‌లు.. భారీ కెమెరా ఐలండ్‌!

Vivo X100 Pro Launch

Vivo X100 Pro Launch

Vivo X100 Pro 5G Smartphone Images Leaked: ‘వివో ఎక్స్‌100 ప్రో’ స్మార్ట్‌ఫోన్ సోమవారం రాత్రి 7 గంటలకు చైనాలో విడుదల కానుంది. భార‌త్ మార్కెట్‌లో ఈ సిరీస్ త్వరలోనే లాంఛ్ కానుంది. వివో ఎక్స్‌100 ప్రోతో పాటు వివో ఎక్స్‌100, వివో వాచ్ 3 కూడా నేడు లాంచ్ కానున్నాయి. అయితే వివో ఎక్స్‌100 ప్రొ ఇమేజ్‌ల‌ను లాంచ్‌కు ముందే వివో కంపెనీ విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌, క‌ల‌ర్ అషన్స్ మొబైల్ ప్రియులను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి.

వివో విడుద‌ల చేసిన అధికారిక ఇమేజ్‌లలో వివో ఎక్స్‌100 ప్రొ నాలుగు కెమెరాల సెట‌ప్‌, ఫ్లాష్‌తో స‌ర్కుల‌ర్ కెమెరా ఐలండ్‌తో ఉంది. ఇది కస్టమర్లను బాగా ఆకట్టుకోనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300ఎస్ఓసీ, జీస్-బ్రాండెడ్ కెమెరాలు మరియు వీ2 ఇమేజింగ్ చిప్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుందని ఇప్పటికే కంపెనీ ధృవీకరించింది. డైమెన్సిటీ 9300 మీడియాటెక్ లేట‌స్ట్‌, ప‌వ‌ర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ చిప్ కాగా, జీస్ బ్రాండెడ్ కెమెరాల‌తో వివో ఎక్స్‌100 ప్రొ అద్భుత‌మైన ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది.

Also Read: World Cup 2023: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. జట్టులో రోహిత్ శర్మకు దక్కని చోటు! తుది జట్టు ఇదే

వీ2 ఇమేజింగ్ చిప్ ద్వారా వివో ఎక్స్100 ప్రొ కెమెరా సామ‌ర్ధ్యం మ‌రింత మెరుగ‌వ‌నుంది. ఈ ఫోన్ బ్లాక్‌, బ్లూ, వైట్‌, ఆరెంజ్ క‌ల‌ర్ ఆప్ష‌న్స్‌లో లభించనుంది. ఇక వివో ఎక్స్‌100 ప్రొ బేస్ మోడ‌ల్ భారత క‌రెన్సీ ప్ర‌కారం దాదాపు రూ. 45,600కు అందుబాటులో ఉంటుంద‌ని అంచ‌నా. భారతదేశంలో స్టాండర్డ్ వివో ఎక్స్90 రూ. 59,999కి లాంచ్ చేయబడింది. ఇక ఈ ఫోన్ చైనాలో నేడు రిలీజ్ కానుండగా.. త్వరలో భారతదేశం మరియు ఇతర ప్రపంచ మార్కెట్లలోకి రానుంది.

Exit mobile version