7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!

Vivo T5x 5g Fusion Red

Vivo T5x 5g Fusion Red

Vivo T5x 5G Fusion Red: వివో (vivo) ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన వివో టి5ఎక్స్ 5జి (vivo T5x 5G) స్మార్ట్‌ఫోన్‌కు కొత్తగా ఫ్యూజన్ రెడ్ (Fusion Red) కలర్ వేరియంట్‌ను జత చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ స్టార్ సిల్వర్ (Star Silver), సైబర్ గ్రీన్ (Cyber Green) రంగుల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఫ్యూజన్ రెడ్ రంగుతో మరోసారి వినియోగదారులకు అందించింది. కొత్త కలర్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో 6.76 అంగుళాల Full HD+ (2408×1080 పిక్సెల్స్) డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్తో వస్తుంది. దీంతో వీడియోలు, గేమింగ్, స్క్రోలింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm MediaTek Dimensity 7400 Turbo ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అమర్చారు. దీనికి Mali-G615 MC2 GPU జత కావడంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. ఫోన్ 6GB, 8GB LPDDR4X RAMతో పాటు 128GB, 256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP సోనీ IMX852 ప్రధాన కెమెరాను అందించారు. దీనికి 2MP డెప్త్ సెన్సార్ తోడుగా ఉంటుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ముందు, వెనుక కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేయగలవు. అలాగే ఇది 7,200mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీను అందించారు. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో వస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB Type-C వంటి ఆధునిక ఫీచర్లను అందించారు

vivo T5x 5G 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999, 8GB + 128GB మోడల్ ధర రూ.27,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.30,999గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, SBI క్రెడిట్ కార్డులపై రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 6 నెలల వరకు No-Cost EMI సదుపాయం కూడా అందిస్తున్నారు.