NTV Telugu Site icon

Vivo T2 Pro 5G Launch: వివో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్.. కర్వడ్‌ డిస్‌ప్లే, 64ఎంపీ కెమెరా!

Vivo T2 Pro 5g Smartphone

Vivo T2 Pro 5g Smartphone

Vivo T2 Pro 5G Smartphone Launches in India with Rs 23,999: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వివో’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అదే ‘వివో టీ2 ప్రో 5జీ’ స్మార్ట్‌ఫోన్‌. మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో ఈ ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కర్వడ్‌-సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి మెరుగైన ఫీచర్లతో వచ్చింది. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటలకు వివో టీ2 ప్రో 5జీ ఫోన్ భారత్‌లో లాంచ్ అవనుందని ‘వివో ఇండియా’ తన ఎక్స్‌లో ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ ధర, ఫీచర్ల వివరాలను ఓసారి చూద్దాం.

Vivo T2 Pro 5G Price:
వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ. 23,999గా ఉండగా.. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ. 24,999గా ఉంది. సెప్టెంబర్‌ 29 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ఆరంభం కానున్నాయి. వివో వెబ్‌సైట్, ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు అందుబాటులో ఉంటయ్యి. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ. 2వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. వెయ్యి రూపాయలు అదనపు బోనస్‌ కూడా ఉంది.

Vivo T2 Pro 5G Specs:
వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ 6.78 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్‌ రేటు, 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ డిస్‌ఫ్లే ఇందులో ఉంటుంది. ఈ ఫోన్‌ మందం 7.36 ఎంఎం కాగా.. బరువు175 గ్రాములు. వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ఆక్టాకోర్‌ డిమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 13తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

Also Read: IND vs AUS: టాస్‌ నెగ్గిన భారత్‌.. అయ్యర్‌, అశ్విన్ వచ్చేశారు! తిలక్‌కు షాక్‌

Vivo T2 Pro 5G Camera and Battery:
వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ 64 ఎంపీ ప్రధాన కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. బ్యాక్ కెమెరా ఓఐఎస్ సపోర్ట్‌తో 4K వీడియోలను క్యాప్చర్ చేయగలదు. 4600 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌.. 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఇందులో ఉంటుంది. ఎపిక్ గేమింగ్, స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఈ ఫోన్ ద్వారా మీరు పొందనున్నారు.