NTV Telugu Site icon

Vivek Venkataswamy : v6, వెలుగు మీడియా హౌస్‌ను అనగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేశారు…

Vivek Venkataswamy

Vivek Venkataswamy

వారం రోజులుగా కేటీఆర్, అతని మనుషులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమం, ప్రజల సమస్యలు చూపేందుకు v6 ఛానెల్ ను స్థాపించామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటసామి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా ఆగకుండా తెలంగాణ కల్చర్ చూపించింది v6 ఛానల్ అని, కాళేశ్వరం, మిషన్ భగీరధ లో జరిగిన అక్రమాలు, లోపాలను v6, వెలుగు పేపర్లు చూపించాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఈ రెండు సంస్థలను బ్యాన్ చేయాలని.చూసినా ప్రజల నుండి ఉన్న ఆదరణతో ఏమి చేయలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో v6, వెలుగుకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకండ వివక్ష చూపారని, మీడియా హౌస్ ను అనగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైం లో నాపై ఈడి రైడ్స్ చేయించారని, మేము తప్పు చేయలేదని మా డబ్బులు మాకు ఇచ్చారన్నారు వివేక్‌ వెంకటసామి. ఎవరిదో చూపించి నా ఫామ్  హౌస్ అని చెప్తున్నారని, కేసీఆర్ ను మించిన పెద్ద తుగ్లక్ కేటీఆర్ అని ఆయన మండిపడ్డారు.

Monkeypox: మంకీపాక్స్కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు

అంతేకాకుండా.’మేము కొన్నప్పుడే మా ఫామ్ హౌస్ కు  కాంపౌండ్ వాల్ ఉంది.. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే మా ఫామ్ హౌస్ ఉంది… సొంత చెల్లెను గెలిపించుకోలేని కేటిఆర్ లీడర్ ఎలా అయితడు… ఫిలిం యాక్టర్లతో కేటీఆర్ కు ఉన్న సంబంధాలు అందరికి తెలుసు… V6 ఛానెల్ కు v6 బిజినెస్ సొల్యూషన్స్ కు తేడా తెలియని కేటీఆర్.. V6 బిజినెస్ సొల్యూషన్ అనేది బెంగుళూరులో ఉంది.. దాని డైరెక్టర్లు, స్థాపకులు ఎవరో తెలుసుకోకుండా ఆరోపణలు చేసిండు… V6 కి ,v6  బిజినెస్ సొల్యూషన్ కి ఎలాంటి సంబంధం లేదు.. వి6 పేరు కనబడగానే అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడిండు… ఆరోపణలు చేసే వాళ్ళు గూగుల్లోకి వెళ్లి చూసి తెలుసుకోండి…. కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు…. కేటీఆర్ కు నా సవాల్…నా పై చేసిన ఆరోపణలు నిరూపించు… దమ్ము, ధైర్యం ఉంటే ఎం చేస్తారో చేయండి… నా సంస్థలు అన్ని ఎక్కడ తప్పులు లేకుండా నడిపిస్తున్న.. 2019 తరువాత టి ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా చాలా కీలకంగా పని చేశాను… వారిని గద్దె దించే వరకు వ్యతిరేకంగా పని చేశాను…ప్రశ్నించాను….’ అని వివేక్‌ వెంకటసామి వ్యాఖ్యానించారు.

Xiaomi X Pro QLED: ‘షావోమీ’ నుంచి సూపర్ స్మార్ట్‌టీవీ.. ధర చాలా తక్కువ!