Site icon NTV Telugu

Vistara: విస్తారా విమాన సంస్థ కీలక నిర్ణయం!

Vistra

Vistra

విస్తారా విమాన సంస్థ కీలకం నిర్ణయం తీసుకుంది. ఫైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాల కారణంగా విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు విస్తారా ఎయిర్ లైన్స్ ప్రకటించింది. గత కొన్నిరోజులుగా విమానాల ఆలస్యానికి గల కారణం ఇదేనని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. కొన్ని దేశీయ మార్గాల్లో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు బోయింగ్ 787 లాంటి పెద్ద విమానాల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Tollywood: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. స్టార్ రైటర్ కన్నుమూత

విస్తారా సంస్థకు చెందిన కొందరు పైలట్లు అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఇదే కారణం కాదని, నిర్వహణ భారం కూడా మరో కారణంగా తెలుస్తోంది. టాటాకు సంస్థకు చెందిన ఎయిర్ ఇండియాలో విస్తారా సంస్థ త్వరలో విలీనం కానుంది. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి విస్తారా విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

ఇది కూడా చదవండి: CM Jagan Bus Yatra: రేపు ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్..

 

Exit mobile version