Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి మరో బిగ్ ట్రీట్..

Chiranjeevi Vishvambara

Chiranjeevi Vishvambara

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న చిరు, ఇప్పుడు ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో ఎక్కడా తగ్గకూడదని మేకర్స్ పట్టుదలగా ఉండటంతో విడుదల ఆలస్యమైంది. అలా క్వాలిటీ కోసం ఎంత సమయమైనా తీసుకోవాలని యూవీ క్రియేషన్స్ నిర్ణయించుకోవడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే

Also Read : Naduma Murari : శర్వానంద్-శ్రీవిష్ణు మల్టీస్టారర్?

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నుంచి మరో సాలిడ్ అప్‌డేట్ రాబోతోంది. అద్భుతమైన విజువల్స్‌తో కూడిన ఒక పవర్‌ఫుల్ వీడియో టీజర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఈ కొత్త టీజర్ మెగాస్టార్ ఫాంటసీ సినిమాల రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి విజువల్ వండర్స్‌ను ‘విశ్వంభర’ గుర్తు చేస్తుందో లేదో చూడాలి..