NTV Telugu Site icon

Viswaksen : అసలు ఎలా చేశారు సార్ ? విశ్వక్ సేన్ ప్రశ్నకు షాక్ అయిన హీరో సూర్య

New Project 2024 11 08t133256.470

New Project 2024 11 08t133256.470

Viswaksen : స్టార్ డమ్ తో సంబంధం లేకుండా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మీడియం రేంజ్ హీరోలు ఎంతో మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ లాంటి హీరోలకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఎలాంటిదో కూడా అందరికీ తెలుసు. వాళ్లు తీసేవి చిన్న సినిమాలా.. పెద్ద సినిమాలా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా విశ్వక్ సేన్ ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ జోష్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు పలు రకాల ఈవెంట్లలో పాల్గొంటూ విశ్వక్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాడు. అతను స్టేజ్ ఎక్కాడు అంటే వేసే పంచ్ లు ఓ రేంజ్ లో ఉంటాయి.. అంతేకాదు అవి మీమర్స్ కి బూస్ట్ తాగినంత ఎనర్జీని ఇస్తాయి. విశ్వక్ ఎప్పుడేది మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే.. తాజాగా సూర్య కంగువ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని విశ్వక్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కంగువ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి, సూర్య మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల తప్పిపోయిందన్న విషయం కూడా ఫస్ట్ టైం వెలుగులోకి వచ్చింది.

Read Also:Mohanlal-AMMA: ఆఫీస్ బాయ్‌గా కూడా చేయను.. సూపర్ స్టార్ కీలక వ్యాఖ్యలు!

ఇక రాజమౌళి తర్వాత ఆ ఈవెంట్లో హైలెట్ గా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే విశ్వక్ అనడంలో డౌట్ లేదు. మరి ముఖ్యంగా సూర్యను ఉద్దేశించి విశ్వక్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. తన స్పీచ్ మధ్యలో సూర్య ని సరదాగా విశ్వక్ ఓ ప్రశ్న అడిగాడు.. దానికి ఆడిటోరియం మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇంతకీ అతను అడిగినా ప్రశ్న ఏంటంటే? సూర్య నటించిన సింగం సిరీస్ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిన సంగతే. అందులో సెకండ్ పార్ట్ సింగం 2 లో ఓ సన్నివేశంలో విలన్ ఇల్లు కోసం వెతుకుతుంటాడు సూర్య. అదే సమయంలో దారిన పోయే ఒక వ్యక్తిని ఇంటి అడ్రస్ కోసం అడుగుతాడు. అయితే అతను తనకు ఇంటి అడ్రస్ తెలీదు అనడంతో కోపంలో ఉన్న సూర్య అతడిని పట్టుకుని కొడతాడు. అసెంబ్లీ స్క్రీన్ పైన ప్లే చేయించిన విశ్వక్ అలా అడ్రస్ చెప్పకపోతే కొడతారా సార్ అంటూ సూర్యను ప్రశ్నించారు. అంతేకాదు మీరు అలా ఎందుకు కొట్టారో తెలుసుకోవాలని మా తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికైనా కారణం చెబుతారా సార్ అని అడుగుతాడు. అనుకోకుండా ఎదురైన ఈ ప్రశ్నకు సూర్య పగలబడి నవ్వాడు. అయితే ఈ విషయానికి సమాధానం తన దగ్గర కూడా లేదని.. ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ హరినే అడిగి తెలుసుకుని చెబుతానని సమాధానం ఇస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also:Paturi Nagabhushanam: పవన్‌ కల్యాణ్‌ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..?

Show comments