NTV Telugu Site icon

VishwakSen : నేనేం భయపడను.. నాకు అలాంటి సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు : విశ్వక్ సేన్‌

Vishwak Sen

Vishwak Sen

VishwakSen : యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలతో అలరించారు. తాజాగా విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సారి విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించడంతో పాటు పూర్తి నిడివి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి హాజరైన కారణంగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. లైలా సినిమాతో విశ్వక్‌ సేన్ కెరీర్ లో బెస్ట్ సక్సెస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Also:WPL 2025: నేటి నుండే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 షురూ.. మ్యాచ్‭లను ఎక్కడ చూడాలంటే!

తాజాగా ఒక ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. లైలా సినిమా తన కెరీర్‌లో చాలా స్పెషల్‌ సినిమాగా నిలుస్తుందని అన్నారు. తన కెరీర్లో చేసిన ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ మూవీ ఇదే అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా విశ్వక్ సేన్‌ తన ఫ్యూచర్‌ మూవీస్ గురించి వెల్లడించాడు. మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్లను చేసేందుకు తాను రెడీగా ఉన్నట్లు చెప్పాడు. కానీ హర్రర్‌ సినిమాలు చేసే ఉద్దేశం లేదన్నాడు. హర్రర్‌ సినిమాలు చేయాలనే ఆసక్తి తనకు లేదని, తనకు హర్రర్‌ సినిమాలు చూస్తుంటే తనకు భయం కలగదని అందుకే హర్రర్‌ సినిమాలు చేసే ఆలోచన లేదన్నారు.

Read Also:Donlad Trump: ‘‘బంగ్లాదేశ్‌ని మోడీకి వదిలేస్తున్నా’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

హర్రర్ సినిమాలు చూసి కొందరు చాలా భయపడ్డానని చెబుతుంటారు. ఆ సినిమాను నేను ఒక్కడినే వెళ్లి చూస్తాను. హర్రర్‌ సినిమాలు అంటే నాకు అస్సలు భయం లేదు. నేను భయాన్ని నటించలేను. అందుకు నేను హర్రర్‌ సినిమాలను ఇప్పుడే కాదు భవిష్యతులో కూడా చేయనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ హర్రర్ కామెడీ ట్రెండ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే విశ్వక్‌ సేన్‌ సైతం అలాంటి ఒక సినిమాను చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ విశ్వక్ సేన్‌కి మాత్రం ఆ ఆలోచన లేదని తేలిపోవడంతో కాస్త నిరాశకు లోనయ్యారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ సినిమా హర్రర్‌ కామెడీ అనే విషయం తెల్సిందే. ఆ ఒక్కటే కాకుండా రాబోయే రోజుల్లో చాలా తెలుగు సినిమాలు హర్రర్‌ కామెడీ బ్యాక్ డ్రాప్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.